బోటును వెలికితీసిన ధర్మాడి సత్యానికి సన్మానం.. రూ.20 లక్షల చెక్కు

తన టీమ్‌తో ఎంతో శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యంను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సన్మానించారు. జిల్లా కలెక్టరేట్‌లో సత్యంను సన్మానించి రూ.20 లక్షలు చెక్కును అందజేశారు.

news18-telugu
Updated: October 23, 2019, 9:53 PM IST
బోటును వెలికితీసిన ధర్మాడి సత్యానికి సన్మానం.. రూ.20 లక్షల చెక్కు
ధర్మాడి సత్యానికి కలెక్టర్ సన్మానం
  • Share this:
అందరూ ఆశలు వదులుకున్నారు. గోదావరి నదిలో మునిగిన బోటు దొరకదని.. తమ వారిని కడసారి కూడా చూసుకోలేమని కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అసాధ్యాన్ని సాధించి చూపించారు ధర్మాడి సత్యం. కచ్చలూరులో గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీశారు. పలు మార్లు విఫలమైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తన టీమ్‌తో ఎంతో శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యంను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సన్మానించారు. జిల్లా కలెక్టరేట్‌లో సత్యంను సన్మానించి రూ.20 లక్షలు చెక్కును అందజేశారు.

గోదావరిలో మునిగిన బోటును వెలికితీసేందుకు ధర్మాడికి చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో రూ.22.70 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. పనుల ప్రారంభానికి ముందు ప్రభుత్వం రూ.2.70 లక్షలు చెల్లించింది. ఇప్పుడు బోటును పూర్తిగా వెలికి తీయడంతో మిగిలన రూ.20 లక్షలను కూడా చెల్లించింది. కాగా, మంగళవారం గోదావరి నుంచి ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసింది. ఆ బోటులో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...