CM Jagan: అన్నా అని పిలిస్తే.. నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. రాష్ట్రంలో ఏ పేద గుండె కష్టం అని పిలిచిన వెంటనే స్పందిస్తున్నారు. అందరిలా చేస్తాం.. చూస్తాం.. అని మాటలు చెప్పడం లేదు.. స్పాట్ లోనే ప్రామిస్ చేస్తున్నారు.. సాయ పడి.. దటీజ్ జగన్ మోహన్ రెడ్డి అనిపించుకుంటున్నారు. కళ్ల ముందు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాం ఆదుకోండి అని వేడుకుంటే.. సమస్య ఏంటి అని ఆరా తీస్తున్నారు. ఆ సమస్య నిజమైంది.. పేదలకు భారంగా మారింది అని గుర్తిస్తే.. స్పాట్ లో సాయం చేస్తున్నారు. ఒకటి రెండు సార్లు కాదు.. ఇలాంటి ఘటనలు చాలాసార్లే జరిగాయి. తాజాగా ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామ రక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. సీఎం ఔదార్యానికి ఆ తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుడు అంటూ.. ధన్యవాదాలు చెప్పారు. తమ పాలిట దైవంలా వచ్చి తమ బిడ్డకు ప్రాణం పోశారంటూ ఆ నిరుపేద తల్లిదండ్రులు సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టారు.
ఆసలు ఆ చిన్నారి సమస్య ఏంటంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతోంది. అరుదైన‘గాకర్స్’బారిన పడింది ఆ చిన్నారి తల్లి. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి నిరు పేదలు. తండ్రి ఇంటింటా ప్రభుత్వ రేషన్ వాహనాన్ని నడుపుకుంటూ, తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, కుమార్తె హనీ ఉన్నారు. అయితే హనీకి 15 రోజులకోసారి 1.25 లక్షల విలువైన సెరిజైమ్ అనే ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. ఆ ఇంజెక్షన్ ను అమెరికాకు చెందిన సంస్థ డిస్కౌంట్ తో కలిపి.. 74 వేల రూపాయలకు అందిస్తోంది.
అయితే రోజూ హనీకి ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ రోజుకు ఇంత ఖర్చు చేయడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు. దీంతో తమ కూతురిని ఎలా దక్కించుకోవాలో తెలియక.. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపద్బాంధవుడిలా కనిపించారు. గత జూలై 26న సీఎం జగన్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కాన్వాయ్‌తో వెళుతున్నారు. ఆ సమయంలో సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి అనే అభ్యర్థనతో ప్లకార్డు పట్టుకుని.. హెలిప్యాడ్ సమీపాన కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు నిలుచున్నారు.
ఇదీ చదవండి : కప్పు కాఫీ ధర రూ.637.. అరకు కాఫీకి ఇంత డిమాండ్.. ఎందుకంటే?
వెంటనే ఆ ప్లకార్డు చూసి ఆగిన సీఎం జగన్.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని తీవ్రంగా చలించిపోయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా జీవితాంతం వైద్యం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. తాజాగా సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా 10 లక్షల రూపాయల విలువైన 13 ఇంజెక్షన్లను అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి : ఒక్కసారి అక్కడ అడుగుపెట్టారంటే అంతే..! ఆశ్చర్యం తప్ప మరో ఎక్స్ప్రెషన్ ఉండదు..!
అలాగే ఇకపై కూడా దాదాపు రూ.40 లక్షలతో మరో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో కలెక్టర్ సమక్షంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావులు.. హనీకి ఆదివారం ఉదయం తొలి ఇంజెక్షన్ చేశారు. ఆ వెంటనే హనీ తల్లిదండ్రులకు కలెక్టర్ శుక్లా ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్యానికి సీఎం జగన్ కోటి కేటాయించారన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఆ చిన్నారి చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ చొరవతో ఇప్పటికే వైద్యులు తొలి ఇంజెక్షన్ చేశారు. దీంతో తమ పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. నిజంగా మతకు జగనే ప్రత్యక్ష దైవం అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News