Home /News /andhra-pradesh /

EAST GODAVARI CHRISTIAN WOMEN LOCKED THE CHURCH AND FILE A CASE ON PASTOR FOR HARASSMENT IN KONASEEMA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN KKD NJ

East Godavari: ఈ పాస్ట‌ర్ చేసిన ప‌ని తెలిస్తే వామ్మో అనాల్సిందే..! ప్రార్థనల పేరుతో పిలిచి పాడుపనులు..

కోనసీమలో

కోనసీమలో మహిళలను వేధిస్తున్న పాస్టర్

Konaseema: పాస్టర్ అంటే దైవ దూత‌తో స‌మానంగా చూస్తారు. ఆయ‌న చేసే దైవ బోధ‌న‌లు వింటే చాలు దేవుడే స్వయంగా త‌మ‌తో మాట్లాడాడ‌న్న అనుభూతి పొందారు క్రైస్తవ భ‌క్తులు. కాని ఆ జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే ముక్కున వేలేసుకుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Amalapuram, India
    P.Ramesh, News18, Kakinada పాస్టర్ అంటే దైవ దూత‌తో స‌మానంగా చూస్తారు. ఆయ‌న చేసే దైవ బోధ‌న‌లు వింటే చాలు దేవుడే స్వయంగా త‌మ‌తో మాట్లాడాడ‌న్న అనుభూతి పొందారు క్రైస్తవ భ‌క్తులు. కాని ఆ జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే ముక్కున వేలేసుకుంటారు. అదేంటని అనుకుంటున్నారా అయితే మ‌నం కోనసీమ జిల్లాలో జ‌రిగింది తెలుసుకోవాల్సిందే. డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ జిల్లా కోన‌సీమ జిల్లా (Konaseema District) ముమ్మిడివ‌రం మండ‌లంలో రోమ‌న్ కేథ‌లిక్ చ‌ర్చి ఫాద‌ర్ జ‌ల్తాజ‌ర్ రాజుపై లైంగిక ఆరోప‌ణ‌లు పెరిగాయి. అక్కడ‌కు వ‌చ్చే మ‌హిళల‌తో అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తిస్తున్నాడ‌ని చ‌ర్చిలోని భ‌క్తులే ఏకంగా నిర‌స‌న‌కు దిగారు. త‌మ‌తో భూతులు మాట్లాడుతున్నాడ‌ని, అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తిస్తున్నాడ‌ని చ‌ర్చిలోని స‌భ్యులే ఆరోపించారు. అక్కడితో ఆగ‌ని వారంతా ఏకంగా చ‌ర్చికి తాళాలు వేశారు. పాస్టర్ మాకొద్దంటూ నిర‌స‌న తెలిపారు. మ‌హిళ‌లు వారి భ‌ర్తల‌తో క‌లిసి చ‌ర్చి వ‌ద్దకు వెళ్లారు. పాస్టర్ బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్ చేశారు. ఎంత‌కీ పాస్టర్ స్పందించ‌క‌పోవ‌డంతో ఒక్కసారిగా చ‌ర్చిలోని వెళ్లిన మ‌హిళ‌లు పాస్టర్ తీరుపై తీవ్ర ఆందోళ‌న చేప‌ట్టారు.

    ఇది చదవండి: ప్రేమగా మజ్జిగ ఇచ్చి భర్తను చంపేసింది.. మూడు నెలల తర్వాత ఊహించని ట్విస్ట్..!

    ఈ సంద‌ర్భంగా చ‌ర్చిలోని మ‌హిళా స‌భ్యులు మాట్లాడుతూ త‌మ‌తోనే ఇంత దారుణంగా వ్యవ‌హ‌రిస్తున్న పాస్టర్ త‌మ పిల్లల‌ను ఏం చేస్తాడోన‌న్న భ‌యం ఉంద‌న్నారు. వెంట‌నే పాస్టర్ జ‌ల్తాజ‌ర్ రాజును తీసేసి అతని స్థానంలో మరో పాస్టర్‌ను నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దైవ సందేశం వినాల‌ని చ‌ర్చికి వ‌స్తుంటే భూతు పురాణం వినాల్సి వ‌స్తుంద‌ని మహిళలు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

    ఇది చదవండి: ఆస్పత్రి సూపర్‌వైజర్‌కే వైద్యం అందలేదు.. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా..?

    పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు..! చర్చి దగ్గరకు వచ్చి మహిళలు ఆందోళన చేస్తున్నా… చ‌ర్చి ఫాద‌ర్ జల్తాజార్‌ రాజు స‌రియైన స‌మాధానం చెప్పకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. చ‌ర్చిలోని క్రైస్తవ స‌భ్యులు పెద్ద ఎత్తున ముమ్మిడివ‌రం పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్నారు. లిఖిత‌పూర్వకంగా చ‌ర్చి ఫాద‌ర్‌ రాజుపై ఫిర్యాదు చేశారు. ఇది స్థానికంగా అక్కడ సంచ‌ల‌న‌మైంది. ఇదిలా ఉండ‌గా త‌న‌పై కావాల‌నే కొంత మంది గిట్టని వారు మ‌హిళ‌ల‌చే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయిస్తున్నార‌ని, త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని చ‌ర్చి ఫాద‌ర్ జ‌ల్తాజ‌ర్ రాజు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలపై విచారణ చేపడతామన్నారు. గతంలో అనకాపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి క్రిస్టియన్ సంస్థను స్థాపించడమే కాకుండా.. భారీగా డబ్బులు వసూలు చేసి భవంతి కట్టించాడు. అందులో స్వస్థత పేరుతో యువతులను బంధించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. వారి బారి నుంచి తప్పించుకున్న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు