(Ramesh, News18, East Godavari)
మనిషికి పుట్టుక చావు అనేవి ఎవరి చేతుల్లో ఉండవు. అది దైవానుగ్రహం అందుకే ఎవరూ ఎప్పుడు పుడతారో ఎలా చనిపోతారో కూడా తెలియదు. చావు అనేది కూడా ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. కనీసం అనారోగ్యంతో ఉన్నవారు కూడా చనిపోతారని ముందుగా చెబుతారు కానీ వారు ఎప్పుడూ చనిపోతారు అనేది మాత్రం ఎవ్వరు నిర్ణయించలేరు. కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, అలా అని వారు 100 ఏళ్ళు బతుకుతారా..! అంటే అది సాధ్యం కాదు
.కొంతమందికి ఎటువంటి బాధలు బందీలు ఉండవు. కానీ నిండా 40 ఏళ్ళు బతకరు ఇలా చెప్పుకుంటూ ,పోతే అసలు చావు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరు నిర్ణయించలేదు అందుకే చావు పుట్టుకలు అనేవి దైవానుగ్రహంగా జరుగుతాయి అంటున్నారు పెద్దలు..ఇవాళ కాలంలో రంగం నుండి చాలామంది మృత్యువాత పడ్డారు ఇందులో కొంతమంది వృద్ధులు ఉండగా మరి కొంతమంది యుక్త వయసు గలవారు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారంటే చావు అనేది ఎవరి చేతిలో ఉండదనేది తెలుస్తోంది.
కొంతమంది చావు చాలా చారిత్రాత్మకంగా చెబుతుంటారు. వారి కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధాలు లేక సమాజంలో వారు చేసిన సేవలకో తెలీదు, కానీ ఒక్కొక్కరి చావు చరిత్రలో నిలిచిపోతుంది సెంటిమెంట్ గా చెప్పాలంటే భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇలా చెప్పుకుంటూ పోతే మృత్యువులో కూడా కొంతమంది కలిసికట్టుగా ఉంటారు. ఇది అనూహ్యంగా జరిగే పరిణామమే అయినప్పటికీ ఇది కూడా దైవానుగ్రహంగానే భావిస్తారు పెద్దలు.
ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అన్నదమ్ములుగా ఉండే ఇద్దరు కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గర్జనపూడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అప్పన్నకు చెందిన మూడో- ఐదు సంతానం ఒకేసారి మృతి చెందారు . కొత్తూరు గ్రామంలో నివాసముంటున్న బొండు తాతీలు ఆరోగ్యం పాలవడంతో చనిపోయాడు. తాపీలుకు కర్మకాండలు నిర్వహించి అందరూ ఇంటికి వచ్చేసారు. అయితే అప్పటికే తమ్ముడు మృతితో దిగ్భ్రాంతి చెందిన బొండు అప్పారావు కి గుండె పోటు రావడంతో కుప్పకూలి పోయాడు.
కొద్ది సేపటికే అతడు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామములో జరిగిన ఈ విషాద ఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మృత్యువు లో కూడా అన్నదమ్ములు కలిసి ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News