హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lord Ganesha: చెవిలో చెబితే చాలు మీ కోరిక నెరవేరినట్లే..! ఈ గణపయ్య మహత్యం అదే..!

Lord Ganesha: చెవిలో చెబితే చాలు మీ కోరిక నెరవేరినట్లే..! ఈ గణపయ్య మహత్యం అదే..!

బిక్కవోలు గణపతి (ఫైల్)

బిక్కవోలు గణపతి (ఫైల్)

Vinayaka Chavithi: సాధారణంగా మనం గుడికి వెళితే దేవడిని చేతులెత్తి మొక్కి మన కోర్కెలు కోరుకుంటాం. అదే వినాయకుడి గుడికి వెళ్తే గుంజీళ్లు తీస్తారు. కానీ, ఈ ఆలయంలో నేరుగా దేవుని చెవులో కోర్కెలు చెప్పుకోవచ్చు. ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ ఆలయం కొలువైఉంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • East Godavari, India

  సాధారణంగా మనం గుడికి వెళితే దేవడిని చేతులెత్తి మొక్కి మన కోర్కెలు కోరుకుంటాం. అదే వినాయకుడి గుడికి వెళ్తే గుంజీళ్లు తీస్తారు. కానీ, ఈ ఆలయంలో నేరుగా దేవుని చెవులో కోర్కెలు చెప్పుకోవచ్చు. ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోనే ఈ ఆలయం కొలువైఉంది. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి… మన కోర్కెలు ఆయన చెవిలో చెబితే చాలు ఇట్టే నెరవేరుస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఇక్కడ గణపయ్య ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. వినాయక చవితి ఉత్సవాలకు ఈ ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాభైంది. వెయ్యి ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి నిత్యం భక్తులతో సందడిగా ఉంటుంది. బిక్కవోలులో కొలువై ఉన్న శ్రీలక్ష్మీగణపతి స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. భారీ కాయంతో ఉన్న స్వామి వారి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నాగాభరణం, నాగ యజ్ఞోపవీతం, నాగ మొలతాడు, బిళ్లకట్టు పంచెతో భక్తుల కోర్కెలు తీర్చే లంబోధరుడిలా ఆశీనులై ఉంటారు.


  ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తోంది. అప్పట్లో రాజులు ఈ మహాగణపతి దగ్గర ప్రత్యేక పూజలు చేసి తమ పనులు ప్రారంభించేవారని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పనులు పూర్తి అయ్యేవట. అయితే తొమ్మిదో శతాబ్దానికి చెందిన స్వామి వారి విగ్రహం కాలక్రమేణా భుస్థాపితమైంది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో పంట పొలాల్లో ఈ విగ్రహం కనిపించింది. అక్కడ నుంచి గణపతిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో భక్తులు అక్కడే ప్రతిష్టించి ఆలయనిర్మాణం చేశారు.


  ఇది చదవండి: బయటి ప్రపంచానికి తెలియని నవనారసింహ క్షేత్రం.. అక్కడికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే..! ఎక్కడుందంటే..!  అప్పటి రాజులు ప్రత్యేక పూజలు చేసి, పనులు ప్రారంభిస్తే అనుకున్నట్టుగా జరిగేవని ప్రతీతి. ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తులు.. స్వామి వారి చెవిలో తమ కోర్కెలు చెప్పుకుంటూ ఉంటారు. వినాయక చవితి సందర్భంగా శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


  ఇది చదవండి: చిరంజీవి సినిమా ఎఫెక్ట్.. యముడికి భక్తుడిగా మారిన వ్యక్తి.. ఏం చేశాడో చూడండి..!


  ఆలయ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. తీర్థపు బిందె సేవతో స్వామి వారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.12 గంటలకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేస్తారు. ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పదోరోజు మహాన్నదానంతో నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి.


  ఇది చదవండి: మనం మొక్కే ఆ వినాయకుడు ఈ చేతుల సృష్టే..! కానీ వారి పరిస్థితి మాత్రం..!


  ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అలా వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఈ తొమ్మిది రోజులూ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు భోజన సదుపాయం కూడా
  కల్పిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.  గత రెండేళ్లగా కోవిడ్‌ కారణంగా ఆంక్షల మధ్య గణేష్‌ ఉత్సవాలు జరిగాయి. ఈ ఏడాది కాస్త ఆంక్షల సడలింపు ఉండటంతో పెద్ద స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జై బోలో గణేష్‌ మహరాజ్‌ కీ..!

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, Vinayaka Chavithi

  ఉత్తమ కథలు