స్థానిక సంస్థల కోటా నుండి శాసనమండలి సభ్యత్వానికి ఎన్నికలు జరుగుతాయోనన్నఅనుమానాలు బలపడుతున్నాయి. వాస్తవానికి అందరూ వైసీపీ వారే కావడంతో మండలిలో తూర్పుగోదావరి నుండి నామినేషన్ వేసిన కూడుపూడి సూర్యనారాయణరావు గెలుపు నల్లేరుమీద నడకే అనుకున్నారు. తీరా ఆఖరి రోజు నామినేషన్ల పర్వంలో ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలు చేయడం కలకలం రేపింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి వైసీపీ నుండి కుడుపూడి సూర్యనారాయణ నామినేషన్ దాఖలు చేయగా, తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ బలంతో అంబటి కోటేశ్వరరావు మద్ధతులో నామినేషన్ దాఖలు చేశారు. ఈయన తప్పనిసరిగా పోటీలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు. గతంలో ఈయన కోనసీమ జిల్లా ముంగండ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన భార్య తెలుగుదేశం పార్టీనుండి ఎంపీటీసీగా గెలిచి పి.గన్నవరం మండలాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అంబటి సూర్యనారాయణ ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రామచంద్రాపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన ఇంత సంతోషం కూడా స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈయన గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు.
రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కడలి శ్రీదుర్గ టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జేసీ ఇలాక్కియ వీరి ముగ్గురు నుండి నామపత్రాలను స్వీకరించారు. ఈనెల 27వ తేది మధ్యాహ్నాం 3 గంటల లోపు నామ పత్రాల ఉపసంహరణ గడువు ఇచ్చారు.ఈ పరిస్థితి చూస్తుంటే నామినేషన్ల ఉపసంహరణ లేకపోతే పోటీ అనివార్యం. ప్రస్తుతం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే 90 శాతం వరకూ ఉన్నారు. అయితే కొంత మంది నేతల ప్రోద్భలంతోనే స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
కోనసీమలో జనసేన- తెలుగుదేశం పార్టీలు ప్రస్తుతం బలం చూపిస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ రెండు పార్టీల్లో తక్కువగా ఉన్నారు. అయితే అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎక్కువగా వైసీపీకే అనుకూలంగా ఉంటారు. ఒక వేళ పోటీలో నిలబడితే వీరిలో చీలిక రావాలి అలా జరిగితే అది మొత్తం వైసీపీకి పెద్ద సమస్యగా మారుతుంది. నిజానికిఇలా జరిగితే ఈప్రభావం ఏపీ రాజకీయాలపైనే పడుతుంది. ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందో చూడాలంటే స్క్రూట్నీ, విత్ డ్రాల వరకూ ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East godavari, Local News, Ysrcp