Home /News /andhra-pradesh /

EAST GODAVARI BIG BLAST IN PARRY SUGAR FACTORY NEAR KAKINADA RECENTLY THIS TYPE ACCIDENTS INCREASE IN ANDHRA PRADESH NGS

Breaking News: ఏపీలో ముగ్గురిని బలితీసుకున్న మరో పేలుడు.. వరుస ప్రమాదాలతో భయం భయం

ఫ్యాక్టరీలో పేలుడు

ఫ్యాక్టరీలో పేలుడు

Breaking News: ఆంధ్రప్రదేశ్ లోని పరిశ్రమల్లో ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఇంకా పాలిమర్స్ గ్యాస్ లేకేజ్ విషాదం మరిచిపోలేదు. అయినా ప్రమాదాలకు అట్టుకట్ట పడడం లేదు. తాజాగా కాకినాడలో మరో ఘటన విషాదం నింపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India
    Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పరిశ్రమల్లో రక్షణ కరువు అవుతోంది. పరిశ్రమల యజమానుల నిర్లక్ష్యమో.. సాంకేతిక లోపమో (Technical Problem).. కారణం ఏదైనా ఇటీవల  ఏపీలో జరుగుతున్న పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా (Kakinada District) లోని  వాకలపూడి గ్రామం దగ్గర పారీ షుగర్ ఫ్యాక్టరీ (Sugar Factory) దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడున్న బాయిలర్ పేలడంతో  ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు స్పాట్ లో కన్నుమూయగా..  మరోకరు ప్రవైట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.. ఈ పేలుడు ధాటికి మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి..? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

    వాకలపూడి లో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదాలు రాకుండా ముందస్తు చర్యలు ఏవీ చేపట్టడం లేదని.. చాలా రోజుల నుంచి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే పట్టించుకోకపోవడం కారణంగా ఈ  భారీ పేలుడు సంభవించదని.. ముగ్గురు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని స్థానికులు... ఫ్యాక్టరీ ఎదుటే నిరసనలు చేపట్టారు.



    గాయపడ్డ నలుగురు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉందని తెలుస్తోంది. అందులో ఏడుగురుని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరో ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కన్వేయర్ బెల్ట్ పేలడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాలకు కరెంటు కష్టాలు తప్పవా..? కేంద్రం ఆంక్షలతో విద్యుత్ ఛార్జీల బాదుడు భయం?

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి కన్నబాబు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇదీ చదవండి : మాజీ మంత్రిపై కుట్ర జరుగుతోందా? వాళ్ల చిట్టా అనిల్ బయటపెడతారా? ఎవరు వారు..?

    గతంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలోని సెజ్ లో ఇటీవల కాలంలో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. గతంలో విశాఖలోని ఎల్ జీ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటన పెద్ద ఎత్తున కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఏపీ రాష్ట్రంలో ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అన్ని ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది. అయినా ఆయా ఫ్యాక్టరీల్లో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకోవడంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు