EAST GODAVARI AZADI KA AMRIT MAHOTSAV CELEBRATIONS IN KAKINADA DISTRICT KENDRIYA VIDYALAYAM LONG FLAG NGS
Azadi Ka Amrit Mahotsav: ఒక్కసారి ఈ జెండాను చూడాలంటే కష్టమే..? త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ.. పొడుగు ఎంతంటే?
75 మీటర్ల జాతీయ పతాకం
Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకం రెప రెపలాడింది.. అయితే ఈ జెండాను ఒక్కసారి చూడాలి అంటే కుదురదు.. అంత పొడుగైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు.. ఇంతకీ ఈ జెండా పొడుగు ఎంతో తెలుసా..?
Azadi Ka Amrit Mahotsav: ప్రస్తుతం దేశభక్తి యావత్ భారత దేశంలో ఉప్పొంగుతోంది.. 75 ఏళ్ల స్వాంతత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు.. అజాది కా అమృత్ మహోత్సవాల పేరుతో.. అంతా ఐక్యతను చాటి చెబుతున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకుల గ్రామంలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు తమ దేశ భక్తిని ప్రదర్శించారు.. 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. 75మీటర్ల జాతీయ జెండాను స్వయంగా రూపొందించారు.. భారత జాతీయ జెండా గొప్ప తనాన్ని అందిరికీ తెలిసేలా చేస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తూ మేరా భారత్ మహాన్.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు.. సరిగ్గా 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టామని కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా.. విద్యార్థుల్లో దేశభక్తిని చాటి చెప్పేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. స్వాంతత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ విద్యార్థుల ర్యాలీతో వలసపాకుల గ్రామం త్రివర్ణ శోభితంగా మారింది. మేరా భారత్ మహాన్ అనే నినాదం ఊరంతా గట్టిగా మారు మోగింది. ఆ గ్రామ ప్రజలంతా జాతీయ జెండాకు వందనం చేస్తూ... అంత పొడుగైన జెండాను చూసిన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే భారతీయులు అందరిలో మరింత ఐక్యతా భావం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ఆగస్టు15 వేడుకలకు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని..ఇంటింటికి జాతీయ జెండాను ప్రభుత్వం అందించనుంది. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రభుత్వం ఇంటింటికి త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయనుంది. దేశంలో ఉన్న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా భారీగా చేస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో భారతదేశం సాధించిన ఘనతలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవ్వడంతో.. ఈ వేడుకలకు మరింత ప్రాముఖ్యత పెరిగింది.. అందుకే భారీగా ఉత్సావాలను చేస్తోంది కేంద్ర ప్రభుత్వం..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.