హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Teacher: ఆస్ట్రేలియా టూ కాకినాడ..! విద్యార్థులను వెతుక్కుంటూ ఖండాంతరాలు దాటొచ్చిన టీచరమ్మ..! ఎందుకో తెలుసా?

Teacher: ఆస్ట్రేలియా టూ కాకినాడ..! విద్యార్థులను వెతుక్కుంటూ ఖండాంతరాలు దాటొచ్చిన టీచరమ్మ..! ఎందుకో తెలుసా?

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా నుంచి కాకినాడకు వచ్చిన టీచర్

East Godavari : టాలెంట్ ఎక్కడ ఉన్నా దానికి హద్దులు ఉండవు. అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే? ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల పల్లెటూరి విద్యార్థులను వెతుక్కుంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వ పాఠశాల టీచర్‌ వచ్చారు. ఎందుకు , ఏంటి తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P.Ramesh, News18, Kakinada.

  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో మారుమూల పల్లెటూరి విద్యార్థులను వెతుక్కుంటూ ఆస్ట్రేలియా (Australia ) ప్రభుత్వ పాఠశాల టీచర్‌ (Government School Teacher) వచ్చారు. బెండపూడి విద్యార్థులు (Bendpudi Students)… వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రభుత్వ పాఠశాలలో చదివే అమ్మాయిలు…అమెరికన్‌ యాక్సెంట్‌లో ఇరగదీసిన సంగతి ఆంధ్రనాట అందరికి తెలిసిందే. ఇప్పుడు వీళ్ల ఘనత ఖండాంతరాలు దాటింది. ఇటీవ‌ల కాలంలో కాకినాడ జిల్లా (Kakinada District) గా ఉన్న అన్నవ‌రం వెళ్లే మార్గంలో ఉన్న బెండ‌పూడి జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో విద్యార్థులు అమెరిక‌న్ యాక్సెంట్‌లో ఇంగ్లీషు మాట్లాడి ఏకంగా ముఖ్యమంత్రినే మెప్పించారు. ఆ ఇంగ్లీషు మాట్లాడిన విద్యార్థులతో పాటు, బెండ‌పూడి పాఠ‌శాల‌ను ఆద‌ర్శవంతంగా తీసుకుని ఏకంగా ప్రభుత్వ పాఠ‌శాల‌న్నింటిలోనూ ఇదే త‌రహాలో ఇంగ్లీషు నేర్పించ‌డానికి ప్రయ‌త్నాలు మొద‌లుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

  దీనిపై ప్రతిప‌క్షాల నుండి విమ‌ర్శలు వచ్చాయి. అదే స‌మ‌యంలో విద్యార్థులు మాట్లాడిన మాట‌ల‌ను ట్రోల్స్ చేస్తూ మిమ్స్‌తో కాస్త గ‌డ‌బిడ చేశారు. అయితేనేం ఎక్కడా త‌గ్గేదేలే అన్నట్టుగా అక్కడ విద్యార్థులు అమెరిక‌న్ యాక్సెంట్‌ను కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా హైయ‌ర్ క్లాసెస్‌కి చెందిన విద్యార్థులు ఆంగ్ల భాష‌ను అతి సులువుగా మాట్లాడేస్తున్నారు.

  ఖండాంత‌రాలు దాటిన ఆస్ట్రేలియా టీచ‌ర్

  ఇలాంటి త‌రుణంలో ఈ బెంగపూడి విద్యార్థుల వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్‌ దంచికొడుతున్న వీడియో చూసిన ఆస్ట్రేలియాకు చెందిన వివ్యన్ అనే అక్కడి గ‌వ‌ర్నమెంట్ పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న టీచ‌ర్ ఏకంగా ఆస్ట్రేలియా నుండి బెండ‌పూడికి వచ్చారు.

  ఇదీ చదవండి : కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  జిల్లా పరిషత్‌ స్కూల్‌లోని విద్యార్థుల‌తో రోజంతా సందడి చేశారు. వారు ఇంగ్లీషును నేర్చుకుంటున్న విధానాన్ని ప‌రిశీలించి ఉబ్బిత‌బయ్యారు. త‌న‌కు కూడా అమెరిక‌న్ యాక్సెంట్‌లో మాట్లాడాల‌ని ఉంద‌ని చెప్పి విద్యార్థులతో అదే యాక్సెంట్‌లో ముచ్చటించారు.

  ఇదీ చదవండి : ఏపీలో 62 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడ కవాలంటే అక్కడే లబ్ధి.. పూర్తి వివరాలు ఇవే

  ముఖ్యంగా విద్యార్థులు ఏ విధానంలో ఈ భాష‌ను, యాక్సెంట్‌ను మాట్లాడుతున్నారో గ‌మ‌నించిన ఆమె.. విద్యార్థుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంది. ఈ సంద‌ర్భంగా బెండ‌పూడి హైస్కూల్ ఇంగ్లీష్ టీచ‌ర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో కృషితో అమెరికాన్ యాక్సెంట్‌లో పిల్లల‌కు భాష‌ను నేర్పుతున్నామ‌న్నారు. బెండ‌పూడి పాఠ‌శాల ప్రపంచం దృష్టికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. వీడియోలు చూసి విదేశీయులు కూడా తమ విద్యార్థులను ప్రశంసించడం గర్వంగా ఉందని మాస్టర్ ప్రసాద్‌ తెలిపారు.

  ఇదీ చదవండి : నేడే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏ రోజు ఏ వాహన సేవ.. ఈ సారి సామాన్య భక్తులకు అదిరిపోయే శుభవార్త

  క‌లెక్టర్‌ను క‌లిసిన వివ్యన్‌..!

  ఆస్ట్రేలియా టీచ‌ర్ వివ్యన్ కాకినాడ జిల్లా క‌లెక్టర్ కృతికా శుక్లాను క‌లిశారు. ఏపీలో జ‌రుగుతున్న విద్యా కార్యక్రమాలు బాగున్నాయ‌ని, ముఖ్యంగా బెండ‌పూడి పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో తాను గ‌డిపిన క్షణాలు మ‌ర‌చిపోలేన‌ని క‌లెక్టర్‌తో సంభాషించారు. అనంత‌రం ఇక్కడ జ‌రుగుతున్న విద్యా కార్యక్రమాల‌తోపాటు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షిస్తురాలైన వివ్యన్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kakinada, Local News

  ఉత్తమ కథలు