P Ramesh, News18, Kakinada.
ఈ భూమి మీద మగ, ఆడ పుట్టుకలు అనేవి సహజం. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఉండే వారి పుట్టుక మాత్రం అంతుచిక్కని ప్రశ్న. చాలా కాలంగా సమాజం (Society) లో వారంటే చిన్న చూపు. తరాలు మారుతున్న వారి తలరాతలు మారడం లేదు. వారు తాము చేసిన పాపం ఏంటి అని ప్రశ్నిస్తున్నా..? వారిని వెలి వేసే పరిస్థితే ఉంది. మానవుడిలో ఓ రూపమే హిజ్రా. కానీ సమాజం అలా చూడటం లేదు. అందుకే వారు చాలా చోట్ల వివక్షతకు గురవుతున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న హిజ్రాలు (Third Gender) కు సుప్రీం కోర్టు (Supreme Court) ఎంతో విలువైన తీర్పును ప్రకటించింది. థర్డ్ జెండర్ ఉండాలన్న వాదనను వినిపించింది సుప్రీం. ఆనాటి నుండి మొదలైన ఈ విధానంతో వారి జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సహా దేశ పౌరులందరికీ గోప్యత, వ్యక్తిగత గౌరవ రక్షణ హక్కను కల్పించింది. అక్రమణ రవాణా ఆర్టికల్ 23 ప్రకారం నిషేధించబడింది. ఆర్టికల్ 14,15 ప్రకారం మతం, జాతి, సెక్స్, జన్మస్థలం వంటి వాటిపై వివక్షత చూపరాదని తేల్చింది.
మన రాజ్యాంగం లోని 21వ ఆర్టికల్ హిజ్రాలతో సహా దేశ పౌరులందరి గోప్యత, వ్యక్తిగత గౌరవ రక్షణ హక్కును కల్పించింది. మనుషులు, యాచకుల, నిర్బంధ కూలీల అక్రమ రవాణాను ఆర్టికల్ 23 నిషేధించింది. ఇంకా రాజ్యాంగంలో మరెన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకించి 14, 15 ఆర్టికల్స్ మతం, జాతి, సెక్స్, జన్మస్థలం ప్రాతిపదికన వివక్షత చూపడాన్ని నిషేధించారు. ఇవి కేవలం స్త్రీ, పురుషులకు మాత్రమే కాదని, భారతీయ పౌరులందరికీ వర్తిస్తాయి.
ఇదీ చదవండి : ఓల్డ్ ఈజీ గోల్డ్ అంటున్న ప్రజలు.. గానుగ నూనెకు పెరిగిన డిమాండ్.. కారణం ఇదే?
ఈ రకమైన చట్టాలు స్త్రీ పురుషులకు మాత్రమే సంబంధించినవి కాదు. అవి భారత పౌరుల, వ్యక్తుల గురించి ప్రస్తావిస్తున్నాయి. లింగమార్పిడిదారులు భారత పౌరులు. ఈ చట్టాలు హిజ్రాలు, లింగమార్పిడిదారులతో సహా సమస్త వ్యక్తుల హక్కులను కాపాడుతున్నాయి. అయితే ఇంకా ఎక్కడో ఒక చోట మాత్రం వివక్షత కొనసాగుతుందనే చెప్పాలి. ఈనేపథ్యంలో 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ బిల్లు-2014’ను ఏకగీవ్రంగా ఆమోదించాయి. దేశ చరిత్రలో ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుకు ఆమోదం తెలపడం దాదాపుగా దేశ చరిత్రలో ఓ అద్భుతమని విశ్లేషకులు మాట.
ఇదీ చదవండి : టీడీపీ నియోజకవర్గాలపై సీఎం ఫోకస్.. 175 గెలవొచ్చు.. ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అన్న జగన్
థర్డ్‌జెండర్ ఉద్భావన
కేంద్రం ఆమోదించిన రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ బిల్లు ప్రకారం థర్డ్‌జెండర్ అనే కాలమ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రతీ ఉద్యోగంలోనూ థర్డ్‌జెండర్ ఆప్షన్ ఉండేలా చేశారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటు హక్కు, ఓటర్ గుర్తింపు కార్డులతోపాటు, నేషనల్ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ కమిషన్ వంటి వాటిని కల్పించింది. దీంతోపాటు థర్డ్ జెండర్స్‌కు ప్రత్యేకంగా కోర్టును కూడా ఏర్పాటు చేసింది కేంద్రం ప్రభుత్వం. ప్రస్తుతం ఇవి అప్పటి నుండి కొనసాగుతూనే ఉన్నాయి. ఈప్రభావంతో దేశంలో దాదాపుగా టాన్స్‌జెండర్ల పట్ల వివక్షత తగ్గుతూ వస్తుంది.
ఏపీలో కీలక మార్పులు
ఏపీలోని ట్రాన్స్ జెండర్స్‌కు ప్రభుత్వం ఫించన్ సౌకర్యం కూడా కల్పించింది. వాటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించింది. తాజాగా ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని, జిల్లా కలెక్టర్ కృతికా చేతుల మీదుగా థర్డ్ జెండర్స్‌కు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందించారు. ఈ గుర్తింపు కార్డుల ప్రకారం ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించడం థర్డ్‌జెండర్స్‌లో ఆనందం వెల్లివిరుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Local News