హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: మీరు ఇంటిప‌న్ను బ‌కాయిప‌డ్డారా..అయితే ఈ ఆఫ‌ర్ మీ కోస‌మే..!

AP News: మీరు ఇంటిప‌న్ను బ‌కాయిప‌డ్డారా..అయితే ఈ ఆఫ‌ర్ మీ కోస‌మే..!

ఆస్తిపన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం ఆఫర్

ఆస్తిపన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం ఆఫర్

ఇంటిపన్ను బకాయిలు పడ్డవారికి ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా చెల్లించనివారికి వడ్డీ మాఫీ చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

P Ramesh, News18, Kakinada

ఇంటిపన్ను బకాయిలు పడ్డవారికి ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా చెల్లించనివారికి వడ్డీ మాఫీ చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెలాఖరులోగా మొత్తం బకాయిని చెల్లించాలి. అంటే మార్చి 31 ఆఖ‌రు తేదిగా నిర్ణ‌యించారు. అప్పుడే ఈ వడ్డీ రద్దు వర్తిస్తుంది. గతంలోనూ ఆస్తి పన్ను వసూళ్ళకు సంబంధించి పలుమార్లు మినహాయింపు నిచ్చింది. అయినా బకాయిలు చెల్లించని వారు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) వ్యాప్తంగా ఆస్తి పన్ను బకాయిదార్లకు రూ.80 కోట్ల ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బకాయిదార్లతో పాటు పాత బకాయిలపై కూడా ఈ వడ్డీ రద్దు వర్తిస్తుంది.

ఇప్పటివరకు స్థానిక సంస్థలు కలిపిన వడ్డీల్ని మినహాయించి వాస్తవ ఆస్తి పన్నును చెల్లిస్తే ఇక సరిపోతుంది. అలాగే నివసిస్తున్న ఇళ్ళకు ఆస్తి పన్ను ఎసెస్మెంట్ చేయించుకోని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరితో పాటు కొత్త ఆర్ధిక సంవత్సరంలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదుశాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. ఎవరెవరికి రాయితీ వ‌ర్తిస్తుంద‌నేది చూస్తే ఉమ్మడి జిల్లాలోని రాజమండ్రి , కాకినాడ కార్పొరేషన్లతో పాటు అమలాపురం, తుని, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాల్టీలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల్లోని ఆస్తి పన్ను చెల్లింపుదార్లందరికీ ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అత్యధికంగా రాజమండ్రిలో 8 ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలకు సంబంధించి 137 కోట్ల ఆస్తి పన్ను బకాయిలున్నాయి.

ఇది చదవండి: ఉట్టిపడుతోన్న జి-20 సదస్సు శోభ.. వైజాగ్ ఎలా మారిపోయిందో చూడండి

ఇందులో రూ.57 కోట్లు మాత్రమే వాస్తవ బకాయిలు రూ.80కోట్ల వరకు వాటిపై వడ్డీలే. గత పది పదిహేనేళ్ళుగా కూడా ఆస్తి పన్ను చెల్లించనివారి సంఖ్య అధికంగానే ఉంది. కాకినాడ నగరంలో మొత్తం రూ.18 కోట్ల పాత బకాయిలున్నాయి. ఇందులో పదికోట్లు వడ్డీలుకాగా రూ.8 కోట్లు వాస్తవ బకాయిలు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పది కోట్ల వడ్డీ రాయితీ అమల్లోకొచ్చింది. అలాగే రాజమండ్రిలో 28కోట్ల బకాయిలుంటే రూ.13 కోట్లు వాస్తవ బకాయిలు, రూ.15 కోట్లు వడ్డీలు. మిగిలిన పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో మొత్తం 91కోట్ల బకాయిలుంటే ఇందులో 36కోట్లు వాస్తవ బకాయిలు, 55 కోట్లు వడ్డీలు. ఈ నెలాఖరులోగా పాత బకాయిలు చెల్లిస్తే కాకినాడ వాసులకు రూ. 10కోట్లు, రాజమండ్రి వాసులకు రూ. 15 కోట్లు, మిగిలిన ప్రాంతాల వాసులకు రూ.55 కోట్లు మొత్తం 80 కోట్ల వడ్డీ రాయితీ వర్తిస్తుంది.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Local News

ఉత్తమ కథలు