హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఎమ్మెల్సీ ఓటు కోసం టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందా..? రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

AP Politics: ఎమ్మెల్సీ ఓటు కోసం టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందా..? రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 10 కోట్లు ఆఫర్ చేసిందా..?

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై రాజకీయ దుమారం ఆగడం లేదు. అన్ని పార్టీలు వాటిపైనే చర్చిస్తున్నాయి. ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ముడుపుల విషయంపై మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు దేశం పార్టీ వారు తనకు 10 కోట్లు ఆఫర్ చేశారంటు రెబల్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ రచ్చ ఆగడం లేదు. రోజు రోజుకూ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేయడంతోనే టీడీపీ విజయం (TDP Victory) సాధించందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏదైనా..? అదే నిజం అని చెబుతూ వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అందులో ఇప్పటికే ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు కాగా.. అందులో మరో ఇద్దరు చేరారు. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం తాము టీడీపీ (TDP) అభ్యర్థికి ఓటు వేశామని చెప్పడం లేదు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అయితే ఆత్మప్రభోదాను సారం ఓటు వేశామని చెబుతుంటే..? ఉండవల్లి శ్రీదేవీ (Undavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) మాత్రం.. తమకు పార్టీ పెద్దలు చెప్పిన.. కేటాయించిన వైసీపీ అభ్యర్థికే ఓటు వేశామంటున్నారు. కానీ వారే క్రాస్ ఓటు వేశారని అధిష్టానం ఫిక్స్ అయ్యింది. అందుకే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే వారంతా భారీగా డబ్బులకు అమ్ముడుపోయే క్రాస్ ఓటింగ్ చేశారనే వాదనను తెరపైకి తెచ్చింది అధికార వైసీపీ..

తాజాగా జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదట టీడీపీ తనతోనే బేరసారాలు సాగించిందనన్నారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. తనకు తెలుగుదేశం 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని.. తన సన్నిహితుల ద్వారా మొదటే తనను సంప్రదించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తన దగ్గర పెద్దగా డబ్బులు లేవని.. అయతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు. కానీ తాను అలా చేయలేదన్నారు. రాజోలులో ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన తన మిత్రుడు ఏఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా తనతో బేరాలకు దిగారన్నారు. టీడీపీకి ఓటేయాలని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని రాపాక అన్నారు.

ఇదీ చదవండి : రెబల్ ఎమ్మెల్యే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి..? శ్రీదేవి రాజకీయ అడుగులు ఎటు..?

రాజకీయాల్లో ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్నారు రాపాక. సిగ్గు శరీరం వదిలేసి ఉంటే 10 కోట్లు వచ్చి ఉండేవన్నారు. తాను జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని అన్నారు. గత మూడు రోజుల ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. టీడీపీ పెద్దలు కోట్లు కుమ్మరించి.. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపిస్తోంది. ఇప్పుడు రాపక వ్యాఖ్యలతో రాజకీయం మరింత రచ్చ కానుంది.. అయితే ఆ నలుగురు అభ్యర్థులు ఇప్పటికే వైసీపీ పెద్దల తీరును తప్పు పడుతున్నారు. డబ్బుకు అమ్ముడుపోవాల్సిన అవసరం తమకు లేదు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Rapaka varaprasad

ఉత్తమ కథలు