Home /News /andhra-pradesh /

EAST GODAVARI ANDHRA PRADESH NEWS UPPADA BEACH WAVES TENSION KAKINADA NEAR PEOPLE NGS

Uppada Beach: ముప్పు పొంచి ఉందా..? ఉప్పాడ తీరంలో తగ్గని టెన్షన్‌..! ఎగిసిపడుతున్న బురదనీటి అలలు

ఉప్పడ బీచ్ లో వింత పరిస్థితి

ఉప్పడ బీచ్ లో వింత పరిస్థితి

Uppada Beach: ఆంధ్రప్రదేశ్ కు ముప్పు పొంచి ఉందా..? సముద్ర తీరం నిత్యం అల్లకల్లోలకంగా ఎందుకు మారుతోంది. ముఖ్యంగా.. రోజులు గడుస్తున్నా.. తీరం పొడవునా బురద నీటి అలలు ఉగ్రంగా వస్తుండడం దేనికి సంకేతం అనే భయం వెంటాడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India
    Uppada Beach: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు సుదీర్ఘమైన తీరప్రాంతం (Coastal Andhra)ఉంది. అందమైన బీచ్ లు తీర ప్రాంతంలో ఉన్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని, మత్స్యకారులకు జీవనాధారాన్ని కల్పించే సముద్రంలో గత కొన్ని రోజులుగా విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది పొడుగునా నిత్యం ఎదో ఒక రూపంలో ఉప్పాడ తీరం (Uppada Coastal) లో సముద్రపు అలలు స్థానికులను అందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రం పెద్ద పెద్ద అలలతో ముందుకు రావడం.. తరువాత వెనక్కి వెళ్లిపోవడంతో కలకలం రేగుతోంది. ఆ మధ్య తీరం సముద్రం ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కివెళ్లింది. ఇప్పుడు ఇంకో భయం వెంటాడుతోంది. బురద నీటితో కెరటాలు ఉప్పొంగుతున్నాయి. తీరంలో అలలు ఎర్రగా మారి ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో బురద నీరు చేరి పదిహేను రోజులు గడిచినా.. బురద అలల అలజడి తగ్గలేదు.

    కినాడ (Kakinada) లోని ఉప్పాడ సముద్ర (Uppada Beach) తీరంలో కనిపించిన దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత కొన్ని రోజులు క్రితం రెండు రంగులలో కనువిందుగా కనిపించిన సముద్రం స్థానికుల్ని మంత్రముగ్దులను చేసింది. ఆ దృశ్యం ఇంకా అక్కడ అలాగే దర్శనమిస్తోంది. ఇంకా కలవని కఠిన జలాలు, సాధు జలాలూ వేరువేరుగా కనిపిస్తున్నాయి. తీరం పొడవునా బురద నీటి అలలు ఎగిసిపడుతున్నాయి.

    Mud Waves || ఉప్పాడ తీరంలో బురద అలలు.. ఎక్కడ చూసినా తూనీగ గుంపులు || Ten... https://t.co/SZGpsvehwv via @YouTube #Kakinada #Beach #beachlife #beachgirl #beachbabe #andhra_aunty @SandhyaUppada

    ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. బురద నీరుతో నీలి సముద్రం కాస్త ఎర్ర సముద్రంగా మారింది.. వరద నీరు ఎక్కువగా రావడం తో నీళ్ళు రెండు రంగుల్లో కనువిందు చేశాయి. బురద నీటితో కెరటాలు ఉప్పొంగుతున్నాయి. సముద్ర తీరంలో అలలు ఎర్రగా మారి ఎగిసిపడుతున్నాయి.



    సముద్రంలో బురద నీరు చేరి పదిహేను రోజులు గడిచినా ఇంకా ఆ బురదనీరు సముద్రంలో కలవలేదు. పైగా, దీనికి తోడు సముద్ర తీరంలో తూనీగల సందడి కొనసాగుతోంది. గుంపులు గుంపులుగా బీచ్ పోడవునా తూనీగలే దర్శనమిస్తున్నాయి.

    ఇదీ చదవండి : సీఎం జగన్ కు బీజేపీ సవాల్? దమ్ముంటే జమ్ములమడుగు నుంచి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్

    ఇన్ని రోజులు గడుస్తూ సముద్రపు అలలు ఇంకా సాధారణ స్థితికి ఎందుకు రావడం లేదని ఆందోళన మొదలైంది. ఇలా రంగులు మారడం దేనికి సంకేతాలు భయాందోళనలకు గురవుతున్నారు తీరప్రాంత వాసులు. అంతకుముందు కూడా ఇక్కడే.. ఎగసిపడిన అలలు ఒక్కసారిగా మిస్ అవ్వడం కలకలం రేపింది. ఇసుక మేటలు మాత్రమే కనిపించాయి. ఏకంగా 2 కిలోమీటర్ల మేర వెనక్కి సముద్రం వెళ్లిపోయింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు