(Ramesh Babu, News18, East Godavari
సాధారణంగా చలికాలం అంటే మూడు నెలల పాటు ఆగకుండా ఉంటుంది. సంక్రాంతి (Sankranthi) వరకు ప్రత్యేక చలికాలం అనేది ఎక్కువగా మనకు ఉంటుందని చెప్పాలి. అందుకే భోగి పండుగ (Bhogi Festival ) నాడు చలిమంట వేస్తారు. చల్లగాలి నుండి వేడి వాతావరణంలోకి వెళ్లాలంటే ఈ భోగిమంట ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే పర్యాటకులు చల్లని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేడి కోసం క్యాంప్ ఫైర్ (Camp Fire) చేస్తుంటారు. ఇక్కడ కూడా ముఖ్యంగా చల్లదనం ఆస్వాదించడానికి వెళ్లి, అక్కడ ఉన్న మితిమీరిన చలి ప్రభావాన్ని తట్టుకునేందుకు క్యాంపైర్ వేయడం సాధారణంగా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా చలి తీవ్రత నుండి మనం మనల్ని రక్షించుకునేందుకు చేసుకున్న తాత్కాలిక ఏర్పాటు అని చెప్పాలి.
ముఖ్యంగా సంక్రాంతి పండుగ వరకు ఇలా చలికాలాన్ని ఎంజాయ్ చేస్తుంటారు పర్యాటకులు. సాధారణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చలి సర్వసాధారణమే అయినప్పటికీ సంక్రాంతి తర్వాత చలికాలం పోవడం ఎండాకాలం రావడం అనేది జరుగుతాయి. అయితే ప్రస్తుతం సంక్రాంతి వెళ్లినప్పటికీ ఇంకా చలి ప్రభావం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఉదయం 8 గంటలు సమయం దాటినా కూడా చలి పోవడం లేదు. రోడ్లన్నీ పొగ మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలు చేయడం కూడా ప్రమాదకరంగా మారిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ , రాజమండ్రి , కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ మంచు తెరలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నాడు.. పాపం చివరికి ఇలా అయ్యిందేంటి..?
ఉదయం లేచి పొలాలలోకి వెళ్లే వారికి ఈ మంచు తెరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా మేఘాలు నేలను తాకాయా అన్నట్టుగా ఇక్కడ చలి వాతావరణం కనిపిస్తుంది అని అంటున్నారు. ఈ ప్రభావంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు దూరప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం ప్రయాణాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ నెలాఖరు నాటికి రథసప్తమి సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం చూస్తుంటే వాతావరణం గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి : టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు సీటు ఫిక్స్.. దొంగ ఓట్లపై వైసీపీ అలర్ట్
రథసప్తమి దాటితే ఎండలు బాగా వస్తాయని అంటున్నారు ప్రస్తుతం కాస్తున్న చలికి రాబో ఎండలు దృష్ట్యా వాతావరణం చాలా మిశ్రమంగా ఉండటంతో చిన్న పిల్లలు పెద్దలు ఆరోగ్యం పై ఈ వాతావరణం ప్రభావం చూపిస్తుందా అనే ఆందోళన కూడా మొదలైంది. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈ ఏడాది చలి అత్యంత విపరీతంగా ఉందనేది నిపుణుల మాట.అయితే చలి ఉన్నట్లుగానే త్వరలో రాబోవు ఎండలు కూడా గట్టిగానే ఉంటాయని అంటున్నారు వాతావరణ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, East godavari, Local News, WINTER