Ramesh, News18, East Godavari
పేదల పథకాలు (Welfare SChemes) కొంత మంది అక్రమార్కులకు వరంగా మారాయి. ఇందులో ముఖ్యంగా రేషన్ బియ్యం (Rations Rice) తరలింపు వ్యాపారం లక్షలు దాటి కోట్లకు పడగలెత్తింది. దీనిపై ఒక పక్క విజిలెన్స్, సివిల్ సప్లై (Civil Supply) అధికారుల తనిఖీలు జరుగుతున్నప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి (East Godavari) లో బియ్యం అక్రమాలకు అదుపులేకుండా పోయిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకినాడ జిల్లా (Kakinada District) లో పెద్దపూడి.. సామర్లకోట మండలంలో వరుసగా రాజమండ్రి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి PDS బియ్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొత్తంగా 63.50 క్వింటాళ్లు బియ్యం పట్టు బడ్డాయి. వరుస దాడులతో బియ్యం వ్యాపారుల్లో వణుకు మొదలైంది.
పెద్దపూడి మండలములోని రామేశ్వరం గ్రామములోని పి.కొత్తూరులోని ఒక ఇంటిలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ నిల్వకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంపై, విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు చేశారు.
ఇక్కడ 50 కిలోల చొప్పన 65 బ్యాగ్ ల్లో నిల్వ ఉంచిన 32.20 క్వింటాళ్లను స్వాధీనంచేసుకున్నారు. కొటికలపూడి సతీష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారుగా 1,22,360 రూపాయలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : ఆ కాలేజ్లో ఫ్రీగా పని చేయాలా..? జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సంతకం పెట్టాలా..?
కాకినాడ జిల్లా లోని సామర్లకోట మండలం లోని పి. వేమవరం గ్రామములోని కర్రి సుబ్బారావు అనే వ్యక్తి నివాసంలో 31.50 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్లాస్టిక్ సంచుల్లో 50 కిలోల చొప్పన 63 బ్యాగ్గులతో ఉన్న బియ్యాన్ని గుర్తించిన అధికారులు నిల్వలను స్వాధీనం చేశారు. వీటి విలువ 1,24,700 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : వైసీపీ డ్రామాలు ఆడుతోందా..? బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రీజనల్ విజిలెన్స్ ఎస్పీ పి.వి.రవి కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఎక్కడైనా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారమిస్తే దాడులు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇదీ చదవండి : ఆ జిల్లాల మధ్య జర్నీ ఇక చాలా ఈజీ.. 9వేల కోట్లతో రహదారి నిర్మాణం
తక్కువకు కొనుగోలు..ఎక్కువ ధరకు అమ్మకాలు ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టి సైకిళ్లు, స్కూటర్లతో ఇంటింటికి తిరిగి బియ్యాన్ని రూ.10 నుండి రూ.13 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. వీటిని మిల్లులకు రూ.17 చొప్పన అమ్ముతున్నారు. అక్కడ పాలిష్ చేయబడి ఇవే బియ్యం కొత్త సంచుల్లో మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని కేజీ 45 నుండి 60 రూపాయాల మధ్యలో రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు.
ఇదీ చదవండి : అందరి చూపు ఎమ్ మంగీలాల్ వైపే.. ఏంటి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా..?
ఇలా కోట్లాది రూపాయల వ్యాపారానికి తూర్పుగోదావరి జిల్లా అడ్డాగా మారింది. ఇక్కడ పాలిష్ చేయబడిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేయబడ్డ రేషన్ బియ్యం కొత్త సంచుల్లో చేరి లక్షల రూపాయాలు తెచ్చిపెట్టడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kakinada, Local News