హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: రాజమండ్రి వాసులకు షాక్..! కీలక యూనివర్సిటీ తరలింపు..! కారణం ఇదే..!

AP News: రాజమండ్రి వాసులకు షాక్..! కీలక యూనివర్సిటీ తరలింపు..! కారణం ఇదే..!

తెలుగు యూనివర్సిటీ, రాజమండ్రి

తెలుగు యూనివర్సిటీ, రాజమండ్రి

Telugu university: మూడు దశాబ్ధాలకు పైగా పెనవేసుకున్న అనుబంధం.. ఎందరో సాహితీ వేత్తలకు ఊతమిచ్చిన విశ్వవిద్యాలయం. భాషాభివృద్ధి, రచనల్లో, కొత్త అధ్యాయనానికి శ్రీకారం చుట్టిన తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు పుట్టినిల్లుగా భావించే రాజమండ్రి నుంచి ఇప్పుడా యునివర్సిటీ తరలిపోతోంది.

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18,Visakhapatnam

మూడు దశాబ్ధాలకు పైగా పెనవేసుకున్న అనుబంధం.. ఎందరో సాహితీ వేత్తలకు ఊతమిచ్చిన విశ్వవిద్యాలయం.. భాషాభివృద్ధి, రచనల్లో, కొత్త అధ్యాయనానికి శ్రీకారం చుట్టిన తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు పుట్టినిల్లుగా భావించే రాజమండ్రి నుంచి ఇప్పుడా యునివర్సిటీ తరలిపోతోంది. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి (Rajamahendravaram) కేంద్రంగా ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయం తరలింపును అడ్డుకోవాలని కోరుతున్నారు భాషాభిమానులు. గౌతమి విద్యాపీఠం.. అభిలేఖనా కేంద్రం.. కాటన్ మహాశయుడు ఏర్పాటు చేసిన డెల్టా కార్యాలయం.. ఇవన్ని తూర్పుగోదావరి జిల్లా నుంచి తరలిపోయిన చారిత్రక ఆనవాళ్లు.. సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన రాజమండ్రి నగరంలో నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం ఇప్పడు ఆ లిస్ట్ చేరబోతోంది. తెలుగు విశ్వవిద్యాలయాన్ని తిరుపతి (Tirupati) లేదా విశాఖపట్నం (Visakhapatnam) తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిధ్ధం చేయడంతో రాజమండ్రి వాసులు మండిపడుతున్నారు.

గతంలో చారిత్రక సంస్థల తరలింపు వ్యవహారంలో స్పందించని నేతలు కనీసం ఇప్పుడైనా రంగంలోకి దిగాలని డిమాండ్ చేస్తున్నారు.. రాజమండ్రిలోని హైవే పక్కనే ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని తరలించే ప్రక్రియపై పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు.. సాహితీవేత్తలు.. భాషాభిమానులు కార్యాచరణకు సిధ్దం కావాలని కోరుతున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం.. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయాలున్న తిరుపతికి తెలుగు విశ్వవిద్యాలయాన్ని తరలించే ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది.

ఇది చదవండి: వీళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు..! దూరమైన వాళ్లను దగ్గర చేస్తారు..!


దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలు సిధ్దం చేసి పంపించారని అంటున్నారు రాజమండ్రి వాసులు.. తెలుగు భాషాభివృద్ధి కాంక్షించి 1985 శాసనసభ లో చట్టం చేసిన స్థాపించిన తెలుగు విశ్వవిద్యాలయం నేడు నిరుపయోగంగా మార్చింది పాలకులేనన్న వాదన తెరపైకి తీసుకువస్తున్నారు సాహితీవేత్తలు.. అనేక రచనలకు.. ఊతమిచ్చిన విశ్వవిద్యాలయం కొత్తపల్లి వీరభధ్రం.. బేతవోలు రామబ్రహ్మం.. యండూరి సుధాకర్.. కడప రమణయ్య వంటి తెలుగు సాహితీవేత్తలు ప్రత్యేకమైన శ్రధ్దతో ఎందరికో డాక్టరేట్లను అందించింది.. అటువంటిది ఇప్పుడు రాజమండ్రి నుంచి తరలిపోతుందంటే తమకు ఎంతో ఆవేదన కలుగుతోందని అంటున్నారు సాహితీవేత్తలు.

ఇది చదవండి: ఏపీ తీరంలో టైటానిక్.. వందేళ్లుగా సముద్రంలోనే..ఆసక్తిని రేకెత్తిస్తున్న షిప్ హిస్టరీ..!


తెలుగు భాషకు రాజమండ్రి నగరానికి పెన వేసుకున్న బంధం ఈనాటి కాదు.. ఆదికవి నన్నయ్య.. కందుకూరి వీరేశలింగం వంటి మహామహులు తమ రచనలను ఈ చారిత్రక నగరం నుంచే రచించారు.. గిడుగు రామ్మూర్తిపంతులు తన భాషా ఉద్యమానికి కేంద్రంగా రాజమండ్రినే ఎంచుకున్నారని చరిత్రకారులు గుర్తుచేస్తున్నారు.. సాంస్కృతిక నగరంగా ప్రసిధ్ది చెందిన రాజమండ్రిలో ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయం తరలిపోతుంటే ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడంతో భాషాభిమానులు.. సాహితీవేత్తలు పెదవి విరుస్తున్నారు.. ఎంతో కష్టపడి సాధించుకున్న విద్యాలయం నేడు వేరు ప్రాంతానికి వెళ్లిపోవడం వెనుక నేతల నిర్లిప్తత ఉందని ఆరోపిస్తున్నారు.

ఇది చదవండి: అమ్మో పసుపు కప్పలు.. గోదావరి జిల్లాలలో భయం‌. భయం..! ప్రకృతి వైపరీత్యాలకి ఇది సంకేతమా..!?


ప్రముఖ ప్రవచనకర్త.. గరికపాటి నరసింహారావు వంటి అనేక మంది సాహితీవేత్తలు పిహెచ్డీ లను ఇదే విశ్వవిద్యాలయం నుంచి పొందారు. ఇలా గడచిన మూడు దశాబ్ధాల కాలంలో వందల సంఖ్యలో సాహితీవేత్తలు డాక్టరేట్లను పొందారు. అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగుయునివర్సిటీని రాజమండ్రి నగరంతో పెనవేసుకున్న బంధాన్ని విడదీయడం సరికాదని అంటున్నారు పరిశోధకులు. తెలుగులో అనేక పరిశోధనలకు వేదికగా నిలిచి ఎందరో తెలుగు కవులు. రచయితల అక్షరానికి పదును పెట్టి వందల వేల సంఖ్యలో రచనలు, పాటలు, నవలలు, పద్యాల ముద్రణకు ఊతమిచ్చిన రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం తరలింపుపై పునరాలోచించాలంటున్నారు తెలుగుభాషాభిమానులు.

రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టరేట్లు.. పిహెచ్డీలు పూర్తి చేసిన అనేక మంది సాహితీవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఘనతను.. చరిత్రను తెలియచెప్పడంలో ముందున్నారు.. సువిశాలమైన ప్రాంగణంతో పాటు హాస్టల్ వసతి కూడా ఉన్న యునివర్సిటీలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భాషాభిమానులతో పాటు అనేక మంది తెలుగుపై పరిశోధనలు చేసారు.. తెలుగుభాష అధునిక ప్రక్రియలైన నవల.. నాటకం.. ప్రహాసనం.. స్వీయచరిత్ర.. వ్యాసం.. కథానికలు వంటి రచనలు పురుడుపోసుకున్నది రాజమండ్రిలోనే.. నేదునూరి గంగాధరం పేరిట వందకు పై డాక్టరేట్లు ఆయన జానపద సాహిత్యానికి అందినది కూడా ఈ నేలపైనే. ఇంతటి ప్రాధాన్యత.. ఈ ప్రాంతంతో పెనవేసుకున్న బంధాన్ని విడదీయడం పై డాక్టరేట్లు పూర్తి చేసిన అధ్యాపకులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పాలకులు తలచుకుంటే ముప్పై ఏళ్ల బంధాన్ని కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Rajahmundry

ఉత్తమ కథలు