హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cyber Fraud: కలెక్టర్ కే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Cyber Fraud: కలెక్టర్ కే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

జిల్లా కలెక్టర్ కు షాక్ ఇఛ్చిన కేటుగాళ్లు

జిల్లా కలెక్టర్ కు షాక్ ఇఛ్చిన కేటుగాళ్లు

Cyber Fraud: ఆమె ఒక జిల్లా కలెక్టర్ అన్నింటిపైనా పూర్తి అవగాహన.. చర్యలు తీసుకునే అధికారం ఉంది. కానీ అలాంటి ఆమెను సైతం సైబర్ కేటుగాళ్లు బోల్తా కొట్టించారు.. ఆమెను వాడుకొని దండులు గుంజుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది అంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  Cyber Fraud: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సైబర్ మోసాలు (Cyber Cheating)  రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఒకప్పుడు మోసాలు అంటే ఎక్కవగా గ్రామాల్లో ఉన్నవారినే నమ్మించి మోసం చేసేవారు. లేదా నిరక్ష్యరాస్యునలు మాత్రమే మోసం చేసేవారు.. తరవాత నగరాలకు వీరి మోసాలు విస్తరించాయి. చదువుకున్న వారిని.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని కూడా మోసం చేస్తున్నారు. సైబర్ నేరాలపై పూర్తి అవగాహహన ఉన్న వారిని వదలడం లేదు. టెక్నాలజీ (Technology) ఏ స్థాయిలో పెరిగిందో.. మోసాలు కూడా అదే స్థాయిలో రెట్టింపు అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు (Smart Phones).. సోషల్ మీడియా (Social Media) వినయోగం పెరగడంతో.. మోసాలకు కూడా కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు.. ముఖ్యంగా ఏపీలో ఈ సైబర్ మోసాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రముఖలను టార్గెట్‌గా చేసుకొని వారి పేరుపై నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్లను క్రియేట్‌ చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు.

  ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు ప్రముకుల పేర్లపై నకిలీ సోషల్‌మీడియా అకౌంట్లు క్రియేట్‌ చేసి సన్నిహితులకు డబ్బులకు కావాలంటూ మెసేజ్‌లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లపై వివిధ జిల్లాల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

  తాజాగా కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లాను కూడా వదల్లేదు కేటుగాళ్లు. ఆమె పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో కలెక్టర్‌ కృతికా శుక్లా ఫోటోను డీపీగా పెట్టి అర్జెంటుగా డబ్బు కావాలని జిల్లా స్థాయి అధికారులకు మెసేజ్‌లు పెట్టారు. చాలా మంది అధికారులకు మెసేజ్‌లు రావడంతో.. ఏంటి కలెక్టర్ ఇలాంటి మెసేజ్ చేశారు అంటూ ఆశ్చర్యపోయారు.

  ఇదీ చదవండి : నూతన పరకామణి‌ భవనం ప్రారంభం.. నుదుట తిరునామం, సాంప్రదాయ వస్త్రాలతో కొత్త లుక్కులో సీఎం జగన్

  అయితే అది కొత్త నెంబర్ కావడంతో ..ఉన్నతాధికారులు కలెక్టర్‌ కృతికా శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలిసి కలెక్టర్‌ కృతికా శుక్లా ఖంగుతిన్నారు. అసలు తాను ఎవరినీ డబ్బులు అడగలేదని.. ఇలాంటి మేసేజ్ లు తాను ఎందుకు చేస్తాను అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వెంటనే తనపేరుతో వెళ్లిన మెసేజ్‌లను పరిశీలించిన ఆమె.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే.. మెసేజ్‌లు పంపిన నెంబర్‌ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

  ఇదీ చదవండి : ఇక్కడ తమిళనాడు మార్కెట్ కు ఫుల్ డిమాండ్..! పండగవస్తే ప్రత్యేక సందండి.. స్పెషల్‌ ఏంటంటే..!

  ఇలాంటి మెసేజ్ లు పట్లం అంతా అప్రమత్తంగా ఉండాలని.. తెలిసిన వారి నెంబర్ నుంచి ఇలాంటి మేసేజ్ లు వస్తే.. ముందుగా ఆ మెసేజ్ చేసింది.. వారో కాదో నిర్ధారించుకోవాలని.. అప్పటికీ అనుమానం వస్తే.. బంధువులు స్నేహితుల ద్వారా ఆరాతీసి.. అనుమానం వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Kakinada

  ఉత్తమ కథలు