హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: నేడు కోన‌సీమ ప‌ర్య‌ట‌న‌కు సీఎం.. వ‌ర‌ద ప్రాంతాల్లో జ‌గ‌న్ టూర్ ఇలా సాగనుంది..

CM Jagan: నేడు కోన‌సీమ ప‌ర్య‌ట‌న‌కు సీఎం.. వ‌ర‌ద ప్రాంతాల్లో జ‌గ‌న్ టూర్ ఇలా సాగనుంది..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్

CM Jagan Konaseem District tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లా పర్యటనకు కాసేపట్లో చేరుకోనున్నారు. వానలు, వరద తగ్గినా లంకగ్రామాల ప్రజలు ఇంకా వరదలో ఇబ్బంది పడుతున్నారు.. వారికి సీఎం జగన్ ఎలాంటి హామీ ఇస్తారో చూడాలి..

ఇంకా చదవండి ...

  CM Jagan Konaseema Tour: ఆంధ్రప్రదేశ్ ను ఆ మధ్య భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి, ఎగువ నుంచి వచ్చిన వరదలతో గోదారమ్మ (Godavari Floods) ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదీ (Godavari River) పరివాహక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతానికి అయితే వానలు బ్రేేకిచ్చాయి. వరద తగ్గుముఖం పట్టింది.. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం ముంపై భయం వీడడం లేదు. మళ్లీ వానలు కురుస్తాయనే హెచ్చరికలు భయపెడుతున్నాయి. కోనసీమ జిల్లా (Konaseema District) లోని లంక గ్రామాలు వరదలతో జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వదర బాధితులకు అండగా నిత్యం ప్రజాపత్రినిధులు పర్యటిస్తూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలుగు దేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించడం రాజకీయ రచ్చకు కారణమైంది. ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కోనసీమ జిల్లా (Konaseema District) పర్యటనకు వెళ్తున్నారు.

  సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..

  నేడు కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రాత్రి రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనే బ‌స చేయ‌నున్న జ‌గ‌న్.. బుధ‌వారం కూడా వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. పి.గ‌న్న‌వ‌రం మండ‌లం పెద‌పూడి నుంచి జ‌గ‌న్ టూర్ ప్రారంభం కానుంది.

  ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌తో నేరుగా మాట్లాడతారు. ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌కు కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం పెద‌పూడికి జ‌గ‌న్ చేరుకుంటారు. అక్క‌డికి స‌మీపంలోని పుచ్చ‌కా‌య‌లవారి పేట‌లో వ‌ర‌ద బాధితుల‌తో జ‌గ‌న్ భేటీ అవుతారు. తరువాత అలిగేవారిపేటకు చెందిన వ‌ర‌ద బాధితుల‌తో సీఎం మాట్లాడ‌నున్నారు. అటు నుంచి ఊడిమూడిలంక‌లో వ‌ర‌ద బాధితుల‌తో జ‌గ‌న్ స‌మావేశం అవుతారు. 

  ఇదీ చదవండి : ఇదీ బాలయ్య అంటే.. స్వయంగా ఫోన్ చేసి అభిమాని ఫ్యామిలికీ సర్ ప్రైజ్.. ముద్దులు కురిపిస్తున్న మహిళలు

  త‌ద‌నంత‌రం అదే మండ‌ల ప‌రిధిలోని వాడ్రేవుప‌ల్లికి మ‌ధ్యాహ్నం 2.05 గంట‌ల‌కు జ‌గ‌న్ చేరుకుంటారు. అక్క‌డి నుంచి రాజోలు మండ‌లం మేక‌ల‌పాలెం వెళ‌తారు. ఆ త‌ర్వాత సాయంత్రం 4.05 గంట‌ల‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరుకుంటారు. రాజ‌మ‌హేంద్రవ‌రం గెస్ట్ హౌస్‌లో వ‌ర‌ద‌ల‌పై అధికారుల‌తో స‌మీక్షిస్తారు.ఈ స‌మీక్ష తరువాత మంగ‌ళ‌వారం రాత్రి జ‌గ‌న్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనే బ‌స చేస్తారు. బుధవారం కూడా జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

  ఇదీ చదవండి : తిరుమల శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ.. అనూహ్యంగా తగ్గిన రద్దీ.. కారణం ఇదే?

  గోదావరి వరద కారణంగా లంక గ్రామాల వాసులు ఇప్పటికే వరద నీటిలోనే వుండిపోయారు. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద నదిపాయ తెగి ఇబ్బందులు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలతో పాటు లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులు సీఎం జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి హామీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అలాగే శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలి కోరనున్నారు. మరి జగన్ ఎలాంటి హామీ ఇస్తారు అన్నది చూడాలి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Floods, AP News

  ఉత్తమ కథలు