హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కాకినాడ కార్పోరేషన్‌లో కోట్ల రూపాయలు గోల్‌మాల్‌..! అంతా ఆయనే చేశాడా..? దోచాడా..?

కాకినాడ కార్పోరేషన్‌లో కోట్ల రూపాయలు గోల్‌మాల్‌..! అంతా ఆయనే చేశాడా..? దోచాడా..?

కాకినాడ కార్పొరేషన్ లో నిధులు గోల్ మాల్

కాకినాడ కార్పొరేషన్ లో నిధులు గోల్ మాల్

కాకినాడ కార్పోరేష‌న్ (Kakinada Corporation) పేరు చెబితే చాలు అందరూ హ‌డ‌లిపోతున్నారు.. నిధుల దుర్వినియోగంపై వ‌రుస ఫిర్యాదులు వెళుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయాల్లో కుమ్మక్కయ్యార‌నే ఆరోప‌ణ‌లు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Kakinada, India

  P.Ramesh, News18, Kakinada

  కాకినాడ కార్పోరేష‌న్ (Kakinada Corporation) పేరు చెబితే చాలు అందరూ హ‌డ‌లిపోతున్నారు.. నిధుల దుర్వినియోగంపై వ‌రుస ఫిర్యాదులు వెళుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయాల్లో కుమ్మక్కయ్యార‌నే ఆరోప‌ణ‌లు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి కార్పోరేష‌న్ అధికారుల నుండి వివరణ మాత్రం రావ‌డం లేదు. కాకినాడ జిల్లా (Kakinada District) కు కేంద్రమైన కాకినాడ కార్పోరేష‌న్ పాల‌క‌వ‌ర్గ ప‌ద‌వీ కాలం పూర్తయ్యింది. కాకినాడ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైర‌క్టర్ మ‌రియు క‌మిష‌న‌ర్ హోదాలో ప‌నిచేస్తున్న కె.ర‌మేష్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. దీని ముఖ్య కార‌ణం కాకినాడ‌లో అభివృద్ధి పేరుతో జ‌రిగిన ప‌నుల‌నే చెప్పాలి. అధికార పార్టీ అండ‌ దండ‌ల‌తో రూ.13 కోట్ల నిధుల దుర్వినియోగానికి క‌మిష‌న‌ర్ పాల్పడిన‌ట్టు ఏకంగా పోలీస్‌ స్టేష‌న్‌కు, జిల్లా ఎస్పీకి రిజిస్ట్రర్ పోస్టులో ఫిర్యాదు చేశారు కాకినాడ‌కు చెందిన‌ పౌర సంఘం నేత‌లు.

  ప్రధాన ఆరోప‌ణ‌లివే..!

  కాకినాడ శివారు పోర్టు స్థలంలో జగన్నాధపురం రెండు వంతెనల నడుమ ఉన్న వినాయక సాగర్ ప్రదేశంలో నిర్మాణంలో నిలిచిన పార్కు పనులకు రు.7కోట్లు కేటాయించ‌డం. పార్కు నిర్మాణంలో కాలువ మట్టిని లోతుగా తీయడం వ‌ల్ల ఎన్ టి ఆర్ బ్రిడ్జి రిటైనింగ్ వాల్ కూలి, అప్రోచ్ రోడ్ కృంగి పోవడంతో వాటి నిర్మాణానికి మరో రూ.5 కోట్లు వెచ్చించడం. ఈ ప‌నులు జ‌ర‌గ‌క‌పోయినా రూ.13 కోట్ల బిల్లులు చెల్లింపుల ద్వారా కోట్ల నిదుల దుర్వినియోగానికి కాకినాడ కమిషనర్ కె. రమేష్ కార‌ణ‌మ‌నే వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తున్నారు. క‌మిష‌న‌ర్‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌నే ప్రధాన డిమాండ్‌ను తెర‌పైకి తెస్తున్నారు.

  ఇది చదవండి: రాజరాజేశ్వరీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత ఘట్టం.. చూటడానికి రెండు కళ్లు చాలవు.!

  రూ.3వేల 200కోట్ల వ్యయంతో జరుగుతున్న కాకినాడ చెన్నై వాటర్ వే బకింగ్ హం కెనాల్ రెస్టోరేషన్‌లో పోర్టు అనుమతులు లేకుండా పార్క్‌ నిర్మాణం చేపట్టారంటూ మరింత విమర్శలకు దారితీస్తోంది. అక్కడ నిర్మాణం జ‌ర‌గక‌పోయినప్పటికీ పార్కు పూర్తి చేసిన‌ట్లు చూపించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం దారుణ‌ం అంటున్నారు పౌరసంఘాల నేతలు. ఇందులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయ‌ని అందుకు క‌మిష‌న‌ర్ ఒక్కరే బాధ్యత వ‌హించాల‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పౌర‌సంఘం నాయ‌కులు పేర్కొన్నారు.

  ఇది చదవండి: ఇకపై జేబులో డబ్బులు లేకపోయినా ఎంచక్కా బస్సు ఎక్కేయొచ్చు..!

  బ‌దిలీ అయినా మ‌ళ్లీ అక్కడే పోస్టింగ్‌..!

  బ‌దిలీ అయిన అధికారికి మ‌ళ్లీ అదే పోస్టింగ్ ఇప్పించ‌డంలో కాకినాడ పాల‌కుల పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేద‌ని పౌర సంక్షేమ సంఘం నాయ‌కులు దూస‌ర్ల‌పూడి ర‌మ‌ణ‌రాజు, కార్యద‌ర్శి దువ్వూరి సుబ్రహ్మాణ్యంలు ఆరోపించారు. కేవ‌లం జ‌ర‌గ‌ని ప‌నుల‌కు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఆ అధికారి స‌హ‌కారం ఉండటం వ‌ల్లే ఆయ‌న ఇక్కడ నుండి బ‌దిలీ అయిన‌ప్పటికీ తిరిగి కాకినాడ వ‌చ్చార‌న్నారు. కాకినాడ‌లో జ‌రిగిన మొత్తం రూ.13 కోట్ల అవినీతిపై తాము న్యాయ‌పోరాటం చేస్తామ‌ని, అవ‌ర‌మైతే హైకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు పౌర సంఘం నేత‌లు.

  ఇది చదవండి: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

  విచార‌ణ ఉంటుందా..?

  సాధ‌ర‌ణంగా ఇక్కడ రెండు పార్టీల‌కు చెందిన కార్పోరేట‌ర్లు పాలన సాగించారు. మొద‌ట నాలుగేళ్లు టిడిపి పాల‌న సాగిస్తే, ఆఖ‌రి ఏడాది పాటు వైసీపీ అధికారాన్ని చెలాయించింది. మొత్తం వ్యవ‌హారంలో రెండు పార్టీల‌కు చెందిన వారు చాలా అభివృద్ధి ప‌నుల‌కు ఆమోద ముద్ర వేశారు. తాజాగా వ‌స్తున్న ఆరోప‌ణ‌లు చూస్తుంటే కార్పోరేష‌న్ పాల‌క వ‌ర్గాన్నే త‌ప్పుప‌ట్టించారా, లేక అధికారులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని బిల్లులు చెల్లించారా అనేది తేలాల్సి ఉంటుంది.

  ఒకవేళ దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచార‌ణ చేప‌డితే ఇంకా కాకినాడ కార్పోరేష‌న్‌లో చాలా అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌కొస్తాయ‌ని అంటున్నప్పటికీ అధికార పార్టీ అండ‌తో ప్రస్తుతం ఎన్ని ఫిర్యాదులొచ్చిన విచార‌ణ అనేది మాత్రం ఉండ‌ద‌నే ధీమా కూడా అధికారుల్లో ఉండ‌టం గ‌మ‌నించాల్సిన అంశం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kakinada, Local News

  ఉత్తమ కథలు