హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ఆంధ్రాలో ఎక్కడ గంట మోగినా అది ఈ ఊరి గంటే..! ఎందుకంత స్పెషల్ అంటే..

AP News: ఆంధ్రాలో ఎక్కడ గంట మోగినా అది ఈ ఊరి గంటే..! ఎందుకంత స్పెషల్ అంటే..

ఇత్తడి వస్తువలకు ఫేమస్ అజ్జరం గ్రామం

ఇత్తడి వస్తువలకు ఫేమస్ అజ్జరం గ్రామం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాదు మన దేశంలో ఇత్తడి సామాగ్రి వినియోగం ఎక్కువ. ఇంట్లో వాడుకునే బిందెలు, చెంబులు, పళ్లేలతో పాటు గుడిలో మోగే గంటలు, పూజా సామాగ్రితో పాటు పలు కళాకృతులన్నీ ఇలాంటివన్నీ ఇత్తడితో తయారైనవే. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్ ఓ గ్రామం.

ఇంకా చదవండి ...

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాదు మన దేశంలో ఇత్తడి సామాగ్రి వినియోగం ఎక్కువ. ఇంట్లో వాడుకునే బిందెలు, చెంబులు, పళ్లేలతో పాటు గుడిలో మోగే గంటలు, పూజా సామాగ్రితో పాటు పలు కళాకృతులన్నీ ఇలాంటివన్నీ ఇత్తడితో తయారైనవే. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్ ఓ గ్రామం. తెలుగు రాష్ట్రాల్లో ఏ గుడిలో అయినా, చర్చిలో అయినా గంట మోగిందంటే అది అజ్జరం గ్రామంలో తయారైందే..! తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) అజ్జరం గ్రామంలో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నుండి ఇత్తడి వస్తువులకు చిరునామాగా నిలుస్తోది. అజ్జరం ఇత్తడి వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవని ఇత్తడి వస్తువంటూ లేదు.

అజ్జరం గ్రామ జనాభా 2,957 మంది. వారిలో ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారే 2,500 మంది. తాత ముత్తాతల కాలం నుంచీ గ్రామస్తులు ఈ పనిని కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు వరకూ గంటలు తయారు చేసి ఈ గ్రామస్తులు రికార్డు సృష్టించారు. అమెరికాలోని ప్రముఖ చర్చిలకు కూడ ఇక్కడ తయారైన గంటలను ఎగుమతి చేశారు.


నాణ్యత, నమ్మకం కారణంగానే అజ్జరం ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఇక్కడ ఈ ఇతడి పనులు పూర్వం బ్రిటిష్ వారి హయం నుండే ఇక్కడ ఇతడి పని చేసేవారు ఇక్కడ నుండి అమెరికా వంటి దేశాల లోని చర్చి లకు ఇక్కడి నుండే పెద్దపెద్ద గంటలను తీసుకెళ్తారు. గతంలో చేతితో తయారు చేసేవారు. ఇప్పుడు యంత్రాలు ఆధునిక పనిముట్ల సహాయంతో ఉత్పత్తి ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడి ఇత్తడి వస్తువులను మంచి నాణ్యతతో తయారు చేయటంతో అజ్జరం ఇత్తడి వస్తువులకు మంచి ఆదరణ గిరాకీ ఉంటుంది.

ఇది చదవండి: ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్.. షాకిచ్చిన అధికారులు.. కారణం ఇదే.. ఎక్కడంటే..!


ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకూ ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే తయారై వెళ్లిందే. ఇవే కాదు కె.రాఘవేంద్రరావు ‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ అనే పాట కోసం వేసిన సెట్టింగ్‌లో వాడిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లోని లెక్కలేనన్ని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివే.


ఇది చదవండి: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ.10 లక్షలు.. ఇలా అప్లై చేసుకోండి


ఒకనాడు ఇత్తడి పరిశ్రమ అజ్జరంలో వైభవంగా ఉండేది. యంత్రాలు వచ్చాక పని వేగంగా జరుగుతోంది. నైపుణ్యం ఉన్న కార్మికులు తగ్గిపోతున్నారు. గ్రామంలో 200 ఏళ్లుగా ఈ వ్యాపారం ఉంది. ఐతే ఈతరంలో ఈ పనిని నేర్చుకునేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని చిన్నప్పటి నుంచీ పని నేర్చుకునేవారు తగ్గిపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు అని వాపోతున్నారు అజ్జరం ఇత్తడి పని కార్మికులు.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist

ఉత్తమ కథలు