EAST GODAVARI AFTER DIED A BEGGER FOUND CURRENCY BUNDLES AT HIS LIVING PLACE IN KAKINADA DISTRICT NGS VSP
Shocking: గుండెపోటుతో సాధువు మృతి.. అయ్యో పాపం అనాథ అంటూ చూసేందుకు వెళ్లిన వారికి షాక్.. ఏమైందంటే..?
బిచ్చగాడి దగ్గర మూటలు చూసి షాక్
Shocking: కొందరు పేరుకే బిచ్చగాళ్లు ఉంటారు.. కానీ వారి గురించి వాస్తవాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ అలాంటి వారి చాలామంది ఉంటారు. తాజాగా ఓ సాధు మరణ వార్త విని.. పాపం అంటూ చూసేందుకు వెళ్లిన వారందరికి ఊహించని షాక్ తగిలింది.
Shocking: ఆయన ఓ అనాథ.. ఎవరూ లేకపోవడంతో సాధువు రూపంలో బిచ్చగాడిగా ఊరులో అడుక్కుంటూ జీవనం (Begging Life) సాగిస్తున్నాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినడం లేదా నీటితోనే కడుపు నింపుకోవడం అలావాటు చేసుకున్నాడు. నిత్యం ఊరిలో కనిపించే సాధువే కావడంతో.. అందరూ ఎంతోకొంత సాయం చేసేవారు. కాని అతడు గుండెపోటు (Heart Attack) తో మరణించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లోని.. కొత్తగా ఏర్పడ్డ కాకినాడ జిల్లా (Kakinada) లో చోటు చేసుకుంది. కరప మండలం వేలంగి గ్రామంలో గురువారం రాత్రి సాధువు అయిన ఓ బిచ్చగాడు గుండె పోటుతో చనిపోయాడు. ఆ సాధువు చనిపోవడంతో.. అనాథ ఎవరు లేరంటూ అతని వద్ద మూడు మూటలు ఉన్నాయి. తీరా ఆ మూటల్లో ఏదో చిల్లర పైసులు ఉంటాయి లే అని.. అంతా తెరిచి చూశారు.. కానీ ఆ మూటలు తెరిచి చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. ఆ మూటల్లో నోట్ల కట్టలు ఉన్నాయి. రాత్రి లెక్కింపు పూర్తి కాలేదు. దీంతో ఆ మూటలకు మధ్యవర్తుల సమక్షంలో సీల్ వేసి పోలీస్ స్టేషన్ (Police Station) కు తరలించారు. రోజూ ఊరారా రూపాయి కోసం అందర్నీ అడుక్కొని బిచ్చగాడి దగ్గర అన్ని లక్షల రూపాయలు ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు.
ఆయన గురించి తెలిసినవారు ఏం చెప్పారంటే.. ఆ వ్యక్తి బిక్షగాడు కాదని.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే సాధుపుంగవుడు అంటున్నారు. ఎక్కడినుండి వచ్చాడో తెలియదని.. అయితే ఎవరూ లేని జీవి అని.. హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే వారని.. చిన్న పిల్లలకు బాలారిష్టాలు తొలగేందుకు రక్షరేకులు కట్టేవాడంటున్నారు. అలా అతడికి వచ్చిన డబ్బులు ఖర్చు చేసేవాడు కాదంటున్నారు. ఆ సంచిలో వేసుకునేవాడు. దీంతో స్థానికులే అతని మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ రోజు స్థానిక అధికారుల అందరి సమక్షంలో ఆనోట్ల కట్టలను లెక్కిస్తారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ధనాన్ని పరోపకారానికి ఉపయోగిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆయన పేరు రామకృష్ణ అని స్థానికులు చెబుతున్నారు. ఆ సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడని.. తమ అందరితో సరదగానే మాట్లాడేవాడు అంటున్నారు. స్థానిక చేపల మార్కెట్ వద్ద చిన్న గదిలో ఉండేవాడు ఒక్కడే ఉండడంతో.. నిత్యం సమీపంలోని సత్రంలో రోజూ భోజనం చేస్తూ కాలం వెళ్లదీసేవాడని చెబుతున్నారు. అయితే ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ.. తనకు ఎవరూ లేరని చెప్పేవాడు అంటున్నారు.
సాధువు మరణించాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తరువాత రామకృష్ణ గదిలోకి వెళ్లారు. లోపల మూడు సంచులు నిండుగా కనిపించాయి. వాటిని తెరిచి పోలీసులు షాక్ అయ్యారు. ప్రతి మూట నిండా కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. వాటిలో ఎక్కువగా పది రూపాయల నోట్లు ఉన్నట్టు ఎస్సై డి.రమేశ్ బాబు తెలిపారు. ఆ సొమ్ము మొత్తం దాదాపు 2 లక్షల వరకు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడడం, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో డబ్బు సంచులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.