హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అనాథలకు ఆపద్భాందవుడు..! ఈ యువకుడు చేస్తున్న పనికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!

అనాథలకు ఆపద్భాందవుడు..! ఈ యువకుడు చేస్తున్న పనికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!

రాజమండ్రిలో

రాజమండ్రిలో యువకుడి ధాతృత్వం

మాన‌వ‌సేవే మాధ‌వ సేవ అంటారు. దేవుడికి సేవ చేస్తే ఎంత పుణ్యఫ‌ల‌మో ఆప‌ద‌లో ఉన్న వారి క‌ష్టాల్లో పాలుపంచుకుంటే అంతే పుణ్యం క‌లుగుతుందని పూర్వం నుంచి వస్తోన్న మాట. సరిగ్గా అదే సిద్దాంతాన్ని ఓ యువకుడు ఫాలో అవుతున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Rajahmundry, India

  P Ramesh, News18, Kakinada

  మాన‌వ‌సేవే మాధ‌వ సేవ అంటారు. దేవుడికి సేవ చేస్తే ఎంత పుణ్యఫ‌ల‌మో ఆప‌ద‌లో ఉన్న వారి క‌ష్టాల్లో పాలుపంచుకుంటే అంతే పుణ్యం క‌లుగుతుందని పూర్వం నుంచి వస్తోన్న మాట. సరిగ్గా అదే సిద్దాంతాన్ని ఓ యువకుడు ఫాలో అవుతున్నాడు. రాజ‌మండ్రికి చెందిన ఈ యువ‌కుడు చేస్తున్న సేవ‌కు ఎవ్వరైనా సలాం కొట్టాల్సిందే..! ఎక్కడైనా అనాథశ‌వం చూస్తే చాలు అల్లంత దూరానికి జ‌రిగిపోతుంటాం. కొంత మంది మృత‌దేహాల‌ను చూడ‌లేరు. మ‌రికొంత మంది భ‌యంతో చాలా దూరంగా వెళిపోతుంటారు. కానీ ఎవ‌రైనా చ‌నిపోయి అనాధ‌గా ఉండిపోయింద‌నే కేవ‌లం ఫోన్ కాల్ చేస్తే చాలు అత‌డు అక్కడ వాలిపోతాడు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా శ‌వాన్ని తీసుకెళ్లి పూర్తిగా సొంత ఖ‌ర్చుల‌తో ఖ‌న‌నం చేస్తాడు. అత‌డే భ‌ర‌త్ రాఘ‌వ‌.

  రాజ‌మండ్రి ద‌గ్గర బొమ్మూరుకు చెందిన భ‌ర‌త్ రాఘ‌వ చ‌దివింది డిగ్రీ, అత‌డు ఒక వ్యాన్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. త‌నకున్న వాహ‌నాన్ని న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఇలా త‌న‌కు తాను క‌ష్టప‌డి సంపాదించుకుని తింటే కాద‌ని, న‌లుగురికి సాయం చేయ‌ల‌న్న అత‌డి బ‌ల‌మైన కోరిక ఈ రోజు రాజ‌మ‌హేంద్రవ‌రానికే ఆద‌ర్శమైంది. అనాధ మృత‌దేహాల‌ను తీసుకెళ్లి ఖ‌న‌నం చేయ‌డం, ప్రమాదాలు జ‌రిగితే వారిని ఆసుప‌త్రుల‌కు చేర్చడం, న‌డ‌వ‌లేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆశ్రమాల‌కు చేర్చడం, ఆసుప‌త్రులకు రోగుల‌ను తీసుకెళ్లడం ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు మాన‌వ‌సేవ‌లో మ‌థ‌ర్ థెరిస్సాకు శిష్యుడిగా మారిపోయాడు భర‌త్ రాఘ‌వ‌.

  ఇది చదవండి: ఆ జిల్లాలో ఆర్టీసీ బస్సెక్కాలంటేనే హడలిపోతున్న జనం.. అంతగా భయపెట్టిన విషయం ఏంటంటే..!

  కోవిడ్‌లో మాన‌వ‌త్వధీరుడై..!

  కోవిడ్ స‌మ‌యంలో రాజ‌మండ్రిలో ఎవ్వరూ ప‌ట్టించుకోని చాలా మందిని ఆసుప్రతుల‌కు తీసుకెళ్ళడం, కోవిడ్‌తో చ‌నిపోయిన వారిని ఖ‌న‌నం చేయ‌డం వంటి కార్యక్రమాలు చేశారు. దాదాపుగా రాజ‌మండ్రి పరిధిలో దాదాపుగా 100 మృత‌దేహాల‌ను క‌రోనా స‌మ‌యంలో త‌ర‌లించాడంటే భ‌ర‌త్ రాఘ‌వ సేవ‌కు అంద‌రూ స‌లాం కొట్టాల్సిందే. ఇతడి సేవ‌ల‌కు రాజ‌మండ్రిలోని ప‌లువురు నేత‌లు, అధికారులు సత్కారాలు చేశారు. మాన‌వ‌త్వధీర అనే బిరుదునిచ్చారు.

  ఇది చదవండి: మనకు పులస తెలుసు.. కొర్రమీను తెలుసు.., మరి చీరమీను తెలుసా..? టేస్ట్ ఎలా ఉంటుందంటే..!

  ఎప్పుడైనా కాల్ చేయ‌వ‌చ్చు..!

  ఎక్కడైనా అనాథశవం ఉంద‌ని తెలిస్తే సంబంధిత అక్కడ ప‌రిధిలోని పోలీసు, రెవిన్యూ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చి ఫోన్ చేస్తే చాలు వారి సొంత ఖ‌ర్చుల‌తో ఆ మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేస్తారు. ఇందుకోసం వారి ఫోన్ నెంబ‌ర్లను 8143225514, 7396002881, 9000204589 అందుబాటులో ఉంచారు.

  ఒక మిత్ర బృందంగా ఏర్పడి..!

  తాను చ‌దువుకునే స‌మయంలో త‌న తండ్రి అనారోగ్యంతో చ‌నిపోతే తీసుకెళ్లుందుకు ఎవ్వరూ లేక‌పోవడంతో తాను ప‌డ్డ ఇబ్బందులే ఇత‌రులెవ‌రూ ప‌డ‌కూడ‌ద‌ని అనాధ మృత‌దేహాల‌ను త‌ర‌లిస్తున్నట్లు చెబుతున్నాడు భ‌ర‌త్ రాఘ‌వ‌. భర‌త్ రాఘ‌వ త‌న స్నేహితుల‌తో క‌లిసి అనాధ మృత‌దేహాల‌ను సొంత ఖ‌ర్చుల‌తో శ్మశానాల‌కు తీసుకెళ్లడం, రోగుల‌ను ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లడం చేస్తున్నారు. స్నేహితులు ర‌సూల్‌, రాజు అనే వారితో క‌లిసి భ‌ర‌త్ రాఘ‌వ ఈ సేవ‌ల‌ను చేస్తున్నాడు. ఒక ప‌క్క డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ మ‌రోప‌క్క త‌న‌కున్న స‌మ‌యాన్ని స‌మాజసేవ‌కు ఉప‌యోగిస్తున్నాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Rajahmundry

  ఉత్తమ కథలు