హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఒంటరిగా ఉంటే ముఖానికి గుడ్డ కట్టి అది లేపేస్తాడు..!

ఒంటరిగా ఉంటే ముఖానికి గుడ్డ కట్టి అది లేపేస్తాడు..!

ఒంట‌రి మ‌హిళ‌లే వారి టార్గెట్‌..!

ఒంట‌రి మ‌హిళ‌లే వారి టార్గెట్‌..!

వేసవిలో ఆరుబయట పడుకునే వారు ఇంటి తలుపులకు తాళాలు వేసుకుని పడుకోవాలని, ఊళ్లకు వెళి తే తమకు సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

Ramesh, News18, East Godavari

ప్ర‌స్తుతం ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా (East Godavari) లో జ‌రుగుతున్న క్రైమ్ చూస్తుంటే భ‌య‌ప‌డాల్సిందే. ఎప్పుడు ఏ ప‌క్క నుండి ఏ చెడువార్త వినాల్సి వ‌స్తోందోన‌నే ఆందోళ‌న కలుగుతుంది. ముఖ్యంగా మారుతున్న కాలంలో క్రైమ్ రేటు కూడా రూపుమారిపోతుంది. ఒక‌ప్పుడు దొంగ‌త‌నం అంటే ఓ చిన్నపాటిగా ఉండేవి. కాని ఇప్పుడ‌న్ని హైటెక్ దొంగ‌త‌నాలు, షార్ట్‌క‌ట్‌లో ఎలా ఎదిగిపోవాల‌న్న ఓ దురాలోచ‌న నేరాలకు దారితీస్తోంది. అందులో ముఖ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న నేరాలు, దొంగ‌త‌నాలు పోలీసుల‌కే స‌వాల్‌గా మారుతున్నాయి.

ఒంటరి మహిళల ఇళ్లలోకి చొరబడి వారిని బెదిరించి బంగారు వస్తువులు అపహరిస్తున్న దోపిడీ దొంగను అరెస్టు చేసినట్టు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ ఎం.కిశోర్ కుమార్ తెలిపారు. గతనెల 15వ తేదీ అర్ధరాత్రి బలభద్రపురంలోని సేనాప ప్రతి సత్యవతి ఇంటిలో ఒంటరిగా నిద్రపోతుండగా ముఖానికి గుడ్డ కట్టుకున్న వ్యక్తి వచ్చి ఆమెను బెదిరించి మెడలోని బంగారు తాడును దొంగిలించాడు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్.ఐపి.బుజ్జిబాబు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా బలభద్రపురం వంతెన వద్ద అనుమానాస్ప దంగా తిరుగుతున్న విజయనగరంజిల్లా (Vizianagaram) గంట్యాడ మండలం పెంట శ్రీరామపురానికి చెందిన, ప్రస్తుతం కోనసీమ జిల్లా రా వరంలో ఉంటున్న గంధవరపు గోపీని అదుపులోకి తీసు కోగా అతడి వద్ద నాలుగున్నర కాసుల బంగారు వస్తువులు లభ్యమయ్యాయి. ముందుగా ఒంటరి మహిళల ఇళ్ల వద్ద రెక్కినిర్వహించి ఆపై అర్ధరాత్రుళ్లు వారి ఇంట్లో చొరబడి దొం గతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తెలిసింది. దీంతో గోపీని అరెస్టు చేసి అనపర్తి కోర్టులో హాజరపరుస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. వేసవిలో ఆరుబయట పడుకునే వారు ఇంటి తలుపులకు తాళాలు వేసుకుని పడుకోవాలని, ఊళ్లకు వెళి తే తమకు సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏ ర్పాటు చేస్తామన్నారు.

ఇదిలా ఉంటే భర్తతో కలిసి మోటారు సైకిల్ వెళుతున్న మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలి యని వ్యక్తులు లాక్కుపోయారు. ఈ ఘటన సోమవారం జరిగింది, కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు గ్రామా నికి చెందిన గొల్లవి లక్ష్మి భర్త లోవరాజుతో కలిసి మోటారు. సైకిల్పై రాజమహేంద్రవరం వెళుతోంది. వారి వాహనం వెనుక గుర్తు తెలియని వ్యక్తి వెంబడించాడు. కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం జడ్రగంపేట శివారున ఆదిత్య ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి లక్ష్మి మెడలో ఉన్న మూడు కాసులు బంగారం నల్లపూసల తాడును లాక్కుపోయాడు.

దీనిపై గండే పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దాపురం డివిజ‌న్ ప‌రిధిలో ఈత‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని డీఎస్సీ పి.ల‌తాకుమారి తెలిపారు. నిందితుల్లో కొంద‌రిని ఇటీవ‌ల ఆమె అరెస్టు కూడా చేశారు.జిల్లాలో ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో పోలీసులు ఎక్క‌డికక్క‌డ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మత్తం చేస్తున్నారు. ఒంట‌రి మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై నిఘా పెట్టిన‌ట్టు ఉన్న‌త పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్ర‌తీ వీధిలో సీసీ కెమెరాలు ఉండాల‌ని సూచిస్తున్నారు. ఒంట‌రి మ‌హిళ‌ల నివాసాల‌కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచింద‌ని పోలీసులు చెబుతున్నారు.

First published:

Tags: East godavari, Kakinada, Local News

ఉత్తమ కథలు