హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ బీచ్‌లో వింత... ఇదే మొదటిసారి అంటూ షాక్ అవుతున్న స్థానికులు..!

ఏపీ బీచ్‌లో వింత... ఇదే మొదటిసారి అంటూ షాక్ అవుతున్న స్థానికులు..!

వెనక్కి వెళ్లిన సముద్ర తీరం

వెనక్కి వెళ్లిన సముద్ర తీరం

బీచ్‌లో చోటు చేసుకున్న ఈ వింతను చూసి షాక్ అవుతున్నారు స్థానికులు. బీచ్‌కు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు ఏం జరుగుతుందోనని టెన్షన్ కూడా పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

ఇటీవల కాలంలో సముద్ర తీరాల వద్ద ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సముద్రాలు ముందుకు రావడం.... ప్రకృతి వైపరిత్యాలకు కారణమని చాలామంది చెబుతున్నారు, ఈ మధ్యకాలంలో వైజాగ్ బీచ్ చాలా ముందుకు వచ్చింది. దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా  ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవులో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓడల రేవులో సముద్రం వెనక్కి వెళ్లింది. తీరం నుంచి సముద్రం నీరు సుమారు 30 మీటర్లు వెనక్కి వెళ్లింది.

ఇప్పుడీ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బీచ్‌కు వచ్చిన పర్యాటకులు సముద్రం వెనక్కి వెళ్లడం చూసి షాక్ అవుతున్నారు. నిన్న  మొన్నటి వరకు సముద్రం నీరు ముందుకు రాగా, ఇప్పుడు వెనక్కి వెళ్లడంతో అంతా తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవలి కాలంలో సముద్రం ముందుకు వచ్చి ongc ప్రహరి గోడలను తాకింది. దీనివల్ల రోడ్డు కోతకు గురైంది.

కానీ ఆదివారం నుంచి  సముద్రం వెనక్కు వెళ్ళింది. ఈ ప్రాంతంలో సముద్రం వెనక్కి వెళ్లడం ఇదే తొలిసారి అంటున్నారు స్థానికులు. సముద్రం నీరు ఇలా వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణం ప్రభావంతో ఇలా సముద్రం ముందుకు వెనక్కు వెళ్తున్నట్టు పర్యావరణ వేత్తలు,  నిపుణులు చెబుతున్నారు. దీని గురించి భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. మరోవైపు సముద్రం వెనక్కి వెళ్లిందని తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఓడలరేవు బీచ్‌కు తరలివస్తున్నారు. బీచ్‌ను చూసేందుకు పోటీ పడుతున్నారు.

First published:

Tags: AP News, East godavari, Local News