హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మనకు పులస తెలుసు.. కొర్రమీను తెలుసు.., మరి చీరమీను తెలుసా..? టేస్ట్ ఎలా ఉంటుందంటే..!

మనకు పులస తెలుసు.. కొర్రమీను తెలుసు.., మరి చీరమీను తెలుసా..? టేస్ట్ ఎలా ఉంటుందంటే..!

యానాంలో చీరమీను సందడి

యానాంలో చీరమీను సందడి

బొచ్చ నుంచి.. పులుస (Pulasa Fish) వరకు మన ఆంధ్రప్రదేశ్ లో తెలియని వారుండరు. ఇక పండుగప్ప, చందువ, కొర్రమీను, మట్టగిడసులు, రాగండి, సీలావతి, బంగారు తీగ, బొమ్మిడాయిలు... ఇలా చెప్పుకుంటూ పోతే చేపల లిస్టు చాంతాడంత ఉంటుంది. ఐతే మనకు పులస తెలుసు.. కొర్రమీను పరిచయం అక్కర్లేదు. కానీ చీరమీను పేరు విన్నారా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Yanam, India

  Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam

  నాన్ వెజ్ (Non Veg) అంటే కేవలం చికెన్ (Chicken), మటన్ (Mutton) మాత్రమే కాదు.. చేపలు (Fish), రొయ్యలు (Prawns), పీతలు కూడా ఉంటాయి. ఇక చేపల్లో రకాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. బొచ్చ నుంచి.. పులుస (Pulasa Fish) వరకు మన ఆంధ్రప్రదేశ్ లో తెలియని వారుండరు. ఇక పండుగప్ప, చందువ, కొర్రమీను, మట్టగిడసులు, రాగండి, సీలావతి, బంగారు తీగ, బొమ్మిడాయిలు... ఇలా చెప్పుకుంటూ పోతే చేపల లిస్టు చాంతాడంత ఉంటుంది. ఐతే మనకు పులస తెలుసు.. కొర్రమీను పరిచయం అక్కర్లేదు. కానీ చీరమీను పేరు విన్నారా..? ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా..? ఉభయ గోదావరి జిల్లాలు ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి..ముఖ్యంగా ఇక్కడ దొరికే చేపలు, రొయ్యలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

  ఇక పుస్తెలు తాకట్టు పెట్టైనా సరే, పులస తినాలనే నానుడి కూడా ఇక్కడ్నుంచి వచ్చింది. అదిరిపోయే రేటు పలికే పులస గోదావరి జిల్లాలోనే లభ్యమవుతుంది. ఆ పక్కనే వున్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇప్పుడు చీరమేను సందడి చేస్తోంది. గోదావరిలో లభించే అరుదైన మత్య్స సంపదలో చీరమేను ఒకటి. ఈ సారి కాస్త ముందుగానే వచ్చి ఊరిస్తోంది చీరమేను..చూడ్డానికి చిన్నగా సన్నగా కనిపించే ఈ చేప రుచి అద్భుతం అంటారు భోజన ప్రియులు.

  ఇది చదవండి: దుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టిన రోజా.. మంత్రిగారి మొక్కు అందుకే..!

  గోదావరి మత్స్య సంపదలో రారాజు చీరమేను అప్పుడే సందడి మొదలెట్టేసింది. యానాం గోదావరి తీర ప్రాంతంలో ప్రత్యేక వలల ద్వారా 15కేజీల చీరమేను చేపలను పట్టుకున్నారు మత్యకారులు. యానాంలో 15 కేజీల చీరమేను ముపై నాలుగు వేల రూపాయల ధర పలికింది. 15 కేజీల చీరమేను బకెట్ ‌ను ఆకుల సత్యవతి అనే మత్యకార మహిళ వేలం పాటలో 30,000 వేలకు దక్కించుకుంది. మత్యకార మహిళ సత్యవతి వద్ద ఉన్న 15కేజీల చీరమేను అమలాపురానికి చెందిన మాంస ప్రియుడు వాకపల్లి వెంకటేశ్వరరావు రూ.34,000కు కొనుగోలు చేశాడు.

  ఇది చదవండి: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్..

  అక్టోబర్, నవంబర్ నెలల్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన చిన్న చేప చీరమేను. బైరవపాలెం,యానాం,ఎదురులంక, పిల్లంక,కోటిపల్లి గోదావరి తీర ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది చీరమేను. దీపావళి తరువాత వచ్చే చీరమేను ముందుగా రావడంతో దాన్ని తినడానికి లొట్టలు వేస్తున్నారు మాంస ప్రియులు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు చీరమేను పులుసు, ఇగురు పెట్టుకుని తింటారు. పలుచటి చీరతో సేకరించడం వల్ల వీటికి చీరమేను చేపలనే పేరు వచ్చింది. సుమారు మూడు నెలల పాటు ఇవి దొరుకుతాయని మత్య్సకారులు చెబుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East godavari, Local News

  ఉత్తమ కథలు