Home /News /andhra-pradesh /

EARTHWORM SMUGGLING AT PULICAT LAKE IN ANDHRA PRADESH SU TPT

వానపాముల స్మగ్లింగ్... వాటితో ఏంచేస్తారో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డబ్బులని దైవంగా భావించి పర్యావరణంలో సమతుల్యతను దెబ్బతిస్తున్నారు నయా ప్రకృతి దొంగలు. డబ్బులు ఇస్తామంటే... ఎంతటి దారుణానికైనా ఒడిగడుతారు.

  డబ్బులని దైవంగా భావించి పర్యావరణంలో సమతుల్యతను దెబ్బతిస్తున్నారు నయా ప్రకృతి దొంగలు. డబ్బులు ఇస్తామంటే... ఎంతటి దారుణానికైనా ఒడిగడుతారు. కొందరు ప్రకృతిని ప్రేమిస్తూ.., చట్టపరంగా కోట్లు సంపాదిస్తుంటే....మరికొందరు మాత్రం చట్ట విరోధ పనులు చేసి బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తున్నారు.మానవ జీవనం సవ్యంగా సాగాలి అంటే భూమిపై నివసించే జీవరాసుల పాత్ర కీలకంగా ఉంటుంది. స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటూ....ఎర్ర చందనం నుంచి అడవి జంతువుల వరకు వేటిని విడిచి పెట్టకుండా అక్రమంగా దేశ విదేశాలకు తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సాగుతున్న స్మగ్లింగ్ ఆలోచన ఎవరు అనుమానించారు., అసలు ఎవరు గుర్తించారు కూడా. వారు చేసే స్మగ్లింగ్ వారికి లక్షల రూపాయలు సంపాదించేలా చేసుకుంటుంన్నారు. అసలు వాళ్ళు చేసే స్మగ్లింగ్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు....!! రైతన్న పొలంలో వానపాములు ఉంటే సాగు బంగారు లాంటి దిగుబడి వస్తుంది అంటారు. అలాంటి  వానపాములను ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు.

  పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉంది. పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ చేపలు, వివిధ రకాల పక్షులకు ఆవాసం ఉండటమే కాకుండా ఇక్కడ వానపాములు సైతం అధికంగా ఉంటాయి. పులికాట్ సరస్సులో తవ్వేకొద్దీ వానపాములు బయటకు వస్తుంటాయి. అయితే సరస్సులో మత్స్య సంపదతో పాటుగా.., పలు రకాల జీవరాశుల అభివృద్ధికి తోత్పడుతున్న వానపాములు మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సరస్సు అనుకోని ఉన్న చిత్తడి నేలలో కొన్ని ముఠాలు అక్రమంగా త్రవ్వకాలు జరిపి వానపాములను ఎదేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండ పుష్కలంగా ఉండటంతో....తాము చేసిందే చట్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా బహిరంగానే జరుగుతున్న అరికట్టేందుకు తగినంత  అటవీ శాఖా సిబ్బంది లేకపోవడంతో  తర్జన భర్జన పడుతున్నారు.

  సహజంగా పొలాల్లో కనపడే వానపాముల పరిమాణం కంటే పులికాట్ సరస్సు తీరా ప్రాంతంలో దొరికే వానపాములు పొడవుగాను, లావుగాను ఉంటాయి. సరస్సులో చేరె చెత్త చెదారం, ఇతర ప్రాణుల కళేబరాలు భూమిలో కుళ్ళి మట్టిలో కలిసిపోయేందుకు ఇవి సహాయపడుతుంటాయి. అంతే కాదు వలస పక్షులకు కూడా ఆహారంగా మారుతున్నాయి. అయితే  సరస్సుకు సమీపంలో ఉన్న పేదలను డబ్బు ఆశ చూపి వీటిని వలలో వేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ఒక్కో కిలో వానపాములు 1000 నుంచి 1500 వందలు ఇస్తామని మభ్యపెట్టి స్మగ్లింగ్ కు పునాదులు వేస్తున్నారు. దీంతో వానపాముల సేకరణకే పరిమితం అవుతున్నారు. వానపాముల సేకరణ మంచి గిట్టుబాటు ధర వస్తుండంతో వానపాములు సేకరించడమే వృత్తిగా పెట్టుకుంటున్నారు. వీటిని మట్టికుండలు., థర్మాకోల్ బాక్సులు, పాలిథిన్ కవర్లలో పెట్టి అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఆక్వా సాగులో ఆహారంగా వానపాములు వినియోగిస్తున్నారు.

  ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగు ఎక్కువగా సాగుతుంది. దీంతో ఎక్కువ శాతం...రొయ్యల పెంపకం ఎక్కువగా సాగుతోంది. దింతో పిల్ల రొయ్యలకి అధికంగా డిమాండ్ ఉంది. తల్లి రొయ్య సంతానోత్పత్తకి ఆహారంగా వానపాములను మేతగా వినియోగిస్తున్నారు. వానపాములు ఆహారం కావడంతో అధిక శాతం గుడ్లను పెడుతున్నాయి రొయ్యలు. అధిక దిగుబడి కోసం...ఆక్వా ఫుడ్ యజమానులు కిలో రూ.3500 నుంచి రూ. 4000 వెచ్చించి వానపాములను కొనుగోలు చేస్తున్నారు.

  'వానపాముల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం. వానపాముల సంరక్షణకు ప్రత్యేక చట్టం లేకున్నా... పర్యావరణ సమతుల్యత కోరకు వానపాముల స్మగ్లింగ్ ఏపీ వైల్డ్ యాక్ట్ ప్రకారం నేరం. ముఖ్యంగా వానపాములను రోయ్యలకు ఆహారంగా వేస్తుంటారు. తల్లి రొయ్యకు వీటిని ఆహారంగా అందించడం ద్వారా అధికంగా గుడ్లు పెడుతాయి. దింతో ఆక్వా రైతులకు రాబడి బాగా ఉంటుంది. అయితే పులికాట్ సరస్సులో ఉన్న వానపాములు చాల పెద్దవిగాను, పొడుగుగాను ఉంటాయి. వీటిని అక్రమంగా తరలిస్తే....అక్కడ వాతావరణంలో మార్పులు చేకూరే అవకాశం ఉంది. వేంగాడు, ఇరకం, వాటంబేడు గ్రామాల్లో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. హైవే లో తనిఖీలు చేస్తుంటే... సముద్ర మార్గం గుండా.... వానపాములను ఇంకో ప్రాంతానికి తరలిస్తున్నారు. తమిళనాడులో వానపాముల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో పెద్ద తలనొప్పిగా మారింది. గ్రామాల్లో అవగాహనా తీసుకొస్తున్నాం. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్న... ప్రస్తుతం పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు సేకరణ దారులను హాజరు పరిచాం. స్ముగ్లింగ్ కు ప్రోత్సహిస్తున్న వారికోసం గాలింపు చేపడుతున్నాం. పోలీసులు., స్థానికులు అటవీ శాఖా సిబ్బందికి మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నాం' అని సూళూరుపేట ఇంచార్జ్ డీఎఫ్ఓ పవన్ కుమార్ తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, Smuggling

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు