HOME »NEWS »ANDHRA PRADESH »earthquake in chittoor district people ran out from houses in ramakuppam mandal ba

Earthquake in Chittoor District: చిత్తూరు జిల్లాలో భూకంపం, మూడుసార్లు కంపించిన భూమి

Earthquake in Chittoor District: చిత్తూరు జిల్లాలో భూకంపం, మూడుసార్లు కంపించిన భూమి
ప్రతీకాత్మక చిత్రం

Chittoor earthquake news: చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి మూడుసార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

  • Share this:
    చిత్తూరు (Chittoor) జిల్లాలో భూ ప్రకంపనలు (Earthquake and tremors) వచ్చాయి. భూమి మూడుసార్లు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం కాప్పలి గ్రామంలో భూమి కంపించినట్టు అనిపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి లోపలి నుంచి భారీగా శబ్దాలు వస్తున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు భూమి కంపించిందని చెబుతున్నారు. తాజాగా, నివర్ తుఫాన్ (Cyclone Nivar) కారణంగా చిత్తూరు, నెల్లూరు (Nellore) జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో నీరు భూమి లోపలి పొరలకు ఇంకి ఉంటుందనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో (Hyderabad Floods) కురిసిన భారీ వర్షాలకు బోరబండ (earthquake in Borabanda), గచ్చిబౌలి (earthquake in Gachibowli) ప్రాంతాల్లో కూడా ఇలాగే భూ ప్రకంపలు రావడం, భూమి లోపలి నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. అక్కడకు వెళ్లిన భూగర్భ శాస్త్రవేత్తలు భారీ వర్షాల వల్ల నీరు భూమి లోపలి భాగాల్లోకి ఇంకి ఉంటుందని, అందుకే అలాంటి శబ్దాలువచ్చి ఉంటాయని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:November 30, 2020, 22:02 IST

    टॉप स्टोरीज