తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం... పరుగులు తీసిన ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం... పరుగులు తీసిన ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం... పరుగులు తీసిన ప్రజలు

Earth Quake in Telugu States : అర్థరాత్రి వేళ భూకంపం రావడంతో... ప్రజలకు నిద్రలేని రాత్రిలా మారింది. లక్కీగా అది చిన్న భూకంపమే కావడంతో... ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

 • Share this:
  Earth Quake in Telugu States : ఏపీ, తెలంగాణలో అర్థరాత్రి 2.30 గంటలకు భూకంపం వచ్చింది. 8 సెకండ్లపాటూ భూమి కంపించింది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో... భూ ప్రకంపనలు వచ్చాయి. గుండ్రాయి, చిల్లకల్లు, జగ్గయ్య పేట బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైంది. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. కొంత మంది తమ ఇళ్లలో వస్తువులు కూడా అటూ ఇటూ కదిలాయని అంటున్నారు. ఐతే... ఈ ప్రకంపనల వల్ల భయపడాల్సిన అవసరం లేదనీ, ఇవి చిన్న ప్రకంపనలేననీ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా... ఇటీవల ఎప్పుడూ లేనిది ఇలా భూకంపం రావడంతో... ఆయా జిల్లాల్లో ప్రజల్లో అలజడి రేగింది.

  ఇళ్లలో భూకంపం ప్రభావం  అటు టర్కీలో శనివారం వచ్చిన భూకంపం వల్ల 20 మందికి పైగా చనిపోగా వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆ భూకంపం ప్రభావం వల్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి కంపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భూమి లోపలి పలకాల్లో కదలికల వల్లే ఇలా జరుగుతూ ఉండొచ్చని భావిస్తున్నారు.

  తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి భూకంపం... పరుగులు తీసిన ప్రజలు


  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు