వెంట్రుకలకు రూ.11.17 కోట్లు...తలనీలాలతో టీటీడీకి భారీగా ఆదాయం

తిరుమలలో ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతుంది. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 1,43,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోగా...టీటీడీకి రూ.11.17 కోట్ల ఆదాయం వచ్చింది.

news18-telugu
Updated: February 7, 2019, 8:41 PM IST
వెంట్రుకలకు రూ.11.17 కోట్లు...తలనీలాలతో టీటీడీకి భారీగా ఆదాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అత్యంత సంపన్నమైన దేవుడిగా తిరుమల శ్రీవారికి పేరుంది..! నిత్యం కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయం ఏదైనా ఉందంటే..అది తిరుమ వెంకన్న ఆలయం మాత్రమే..! నిత్య కానుకలు..ఆభరణాల వడ్డీలతో..వడ్డీకాసుల వాడి ఆస్తులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇక భక్తులు సమర్పించే తలనీలాల నుంచి కూడా నెలనెలా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. గురువారం నిర్వహించిన తలనీలాల ఈ-వేలంలో టీటీడీ రూ.11.17 ఆదాయం గడించింది.

తిరుమలలో ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 1,43,900 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.


మొదటి రకం తలనీలాల్లో కిలో రూ.26,005గా ఉన్న ఏ-కేటగిరి - 2,900 కిలోల వెంట్రుకలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.52.01 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ.18,331గా ఉన్న బి- కేటగిరి - 2,100 కిలోల వెంట్రుకలు వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.66 లక్షల ఆదాయం లభించింది. ఇక రెండో రకం తలనీలాల్లో కిలో రూ.17,011గా ఉన్న ఎ-కేటగిరికి చెందిన వెంట్రుకలు 3,100 కిలోల మేర అమ్ముడుపోయాయి.తద్వారా రూ.54.83 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ.8,529గా ఉన్న బి-కేటగిరి చెందిన వెంట్రుకలు 4,300 కిలోల మేర అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.67 లక్షల ఆదాయం లభించింది. మొత్తంగా తలనీలాల విక్రయం ద్వారా టీటీడికి ఆదాయం రూ. 11.17 కోట్లు సమకూరింది.
First published: February 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>