Dussehra 2019 : నేడు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం

Dussehra 2019 : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించడంతో... ఉత్సవాల సందడి మరింత పెరిగింది.

Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 6:13 AM IST
Dussehra 2019 : నేడు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం
Dussehra 2019 : నేడు శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం (Credit - Twitter - DD Saptagiri)
Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 6:13 AM IST
Dussehra Festival 2019 : బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో అత్యంత రద్దీగా మారిపోయింది. అమ్మవారిని రోజుకో రూపంలో చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేసి కరుణ, కటాక్షాలు పొందుతున్నారు. దసరా ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు జన్మించిన మూలానక్షత్రం రోజైన శనివారం (నేడు) దుర్గమ్మ శ్రీ సరస్వతీ దేవిగా భక్తకోటికి దర్శనమివ్వనున్నారు. మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతిగా శక్తి స్వరూపాలతో చెడును అంతం చేసిన దుర్గామాత తన నిజస్వరూపంలో కనిపించడమే ఈ అలంకారం ప్రత్యేకత. మూలా నక్షత్రం నాటి నుంచీ విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భావిస్తారు. అందువల్ల ఇవాళ్టి నుంచీ నాలుగు రోజులపాటూ... కొండకు భక్తుల రాక మరింత పెరుగుతుంది.

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం : శుక్రవారం కనకదుర్గమ్మ... శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఈ రూపంలో దుర్గమ్మ ఎరుపురంగు దుస్తుల్లో భక్తులకు కనిపించారు. అమ్మవారికి పాయసం, చక్ర పొంగిలి, లడ్డు, పులిహార దద్దోజనాలను ప్రసాదాలుగా సమర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, కొందరు మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మ దర్శనం తర్వాత అర్చకులు... సీఎం జగన్‌కు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చి దుర్గమ్మ చిత్రపటం, అమ్మవారి ప్రసాదం ఇచ్చారు.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...