Dussehra Festival 2019 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. దసరా నాడు... ఆశ్వయుజ శుద్ధ దశమి మంగళవారం... శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం పొందేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మరింత మంది తరలివస్తుండటంతో... ఆలయం కిక్కిరిసిపోయింది. సాధారణ భక్తులతోపాటూ... భవానీ దీక్షలు చేపట్టిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. దుర్గామాన నామస్మరణలతో ఆలయం మార్మోగుతోంది. భవానీ దీక్ష విరమణకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన సోమవారం అమ్మవారు శ్రీమహిషాసుర మర్దనీ దేవిగా దర్శనమిచ్చారు. ఎనిమిది చేతులతో మహిషాసురుడిని అమ్మవారు అంతమొందించడంతో... ఆ రూపంలో ఆమెను దర్శించుకొని భక్తులు తరించారు. అమ్మవారికి గారెలు, బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు.
నేడు తెప్పోత్సవం : దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు సాయంత్రం 5 గంటలకు... కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. హంస వాహన సేవలో గంగ, పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వరస్వామిని మూడుసార్లు జలవిహారం చేయించనున్నారు. ఆ తర్వాత శమపూజతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. తెప్పోత్సవం కోసం స్పెషల్ లైటింగ్ డెకరేషన్, రకరకాల రంగుల లైట్లు, పుష్పమాలలతో తెప్పను అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా... ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్ దగ్గర ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...
Health Tips : డైటింగ్, ఎక్సర్సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే
Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి
Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.