ఇంద్రకీలాద్రిపై పెరిగిన రద్దీ... నేడు మహిషాసుర మర్దని అలంకారం

Dussehra 2019 : దసరా దగ్గరపడుతున్నకొద్దీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం మరింత ఎక్కువ మంది భక్తులు రావడంతో... అంతరాలయ దర్శనం నిలిపివేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 7, 2019, 5:46 AM IST
ఇంద్రకీలాద్రిపై పెరిగిన రద్దీ... నేడు మహిషాసుర మర్దని అలంకారం
మహిషాసురమర్దని (credit - Twitter - DD Saptagiri)
Krishna Kumar N | news18-telugu
Updated: October 7, 2019, 5:46 AM IST
Dussehra 9th Day : బెజవాడ ఇంద్రకీలాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్క రోజే మూడు లక్షల మందికి పైగా భక్తులు కొండకు వచ్చారు. అర్థరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండటంతో... రద్దీని కంట్రోల్ చెయ్యడానికి అధికారులు, పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని కళ్లారా చూసి... భక్తి పారవర్యంలో మునిగిపోయారు ప్రజలు. అమ్మవారిని దుర్గమ్మ రూపంలో దర్శనం చేసుకుంటే... అన్ని రకాల సమస్యలూ పరారవుతాయన్న నమ్మకంతో... ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం... రేపటితో దసరా శరన్నవరాత్రులు ముగుస్తుండటం వల్ల... భక్తులకు వీలైనంతవరకూ అన్ని సదుపాయాలూ అందేలా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవాళ నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం అమ్మవారు మహిషాసురమర్దనిగా దర్శనమిస్తున్నారు. నిజానికి ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సహజ స్వరూపం ఇదే. అందుకే ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే... ఎంతో మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ అవతారంలో అమ్మవారు ఎనిమిది చేతులతో అవతరించి... సింహంపై వచ్చి... దుర్మార్గుడైన మహిషాసురుడిని చంపి... దేవతలు, అప్పటి ప్రజల కష్టాల్ని తొలగించింది. ఇక అప్పటి నుంచీ ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవరాత్రులూ జరుపుతున్నారు.

మరోవైపు విజయదశమి రోజున రేపు కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...