భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి... నేడు దుర్గాదేవి అలంకారం

Dussehra 2019 : ఇంద్రకీలాద్రికి శనివారం భక్తుల తాకిడి మరింత పెరిగింది. అమ్మవారి నిజ రూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 6:30 AM IST
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి... నేడు దుర్గాదేవి అలంకారం
నేడు దుర్గాదేవి అలంకారం (Credit - Twitter - DD Saptagiri)
  • Share this:
Dussehra 8th Day : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలతో పోల్చితే... విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కాస్త చిన్నగానే ఉంటుంది. సాధారణ రోజుల్లోనే అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువ. ఇక దసరా పండుగ రోజుల్లో ఆలయానికి భక్తులు నాలుగైదు రెట్లు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. శనివారం అదే జరిగింది. అర్థరాత్రి నుంచే సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచివున్నారు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ జన్మదినం కావడం వల్లే రద్దీ మరింత పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. లక్షల మంది తరలివచ్చినా, వారికి ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు వివరించారు. వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు తెలిపారు.

ఇవాళ నవరాత్రుల్లో 8వ రోజున, అశ్వయుజ సుద్ధ అష్టమి ఆదివారం కావడంతో... అమ్మవారు... దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. లోకానికి శనిలా దాపురించిన దుర్గమాసురుడిని వధించడంతో... అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించారు. అందువల్ల కనకదుర్గమ్మను ఇవాళ దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు ఈనెల 8న కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
First published: October 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading