హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం.. ఈ రోజు దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసా?

Dussehra 2022: అన్నపూర్ణా దేవిగా అమ్మవారి అవతారం.. ఈ రోజు దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసా?

అన్నపూర్ణ దేవీగా అమ్మవారి దర్శనం

అన్నపూర్ణ దేవీగా అమ్మవారి దర్శనం

Dussehra 2022: అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ కనకదుర్గ అమ్మవారు ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు స్వామి వారిని దర్శించుకుంటే.. ఫలితం ఏంటో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022: అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ కనకదుర్గ అమ్మవారు (Kanaka Durga Devi)  నాలుగోవ రోజు అవతారం శ్రీ అన్నపూర్ణ దేవి (Annapurna Devi) గా  ఇంద్రకీలాద్రి మీద దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం దుర్గ మల్లేశ్వర స్వామి (Durga Malleswara Swamy) దేవస్థానంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూ.. భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు. ఇక నాల్గవ రోజు శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి గా దర్శనమివ్వనున్నారు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. అసలు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని అమ్మ ను కొలిచిన వారి గృహం సౌభాగ్యం తో వర్ధిల్లుతుంది.

  ఆశ్వయుజ శుద్ధ చవితి, గురువారము నాడు శరన్నవరాత్రి మహోత్సవముల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తారు.శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు.

  శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు. పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము! పుణ్య ప్రదాయకము. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏది లేదు. ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోవున్న శ్రీ దుర్గమ్మని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు.

  ఇదీ చదవండి : చిన్న శేష వాహనం .. హంస వాహనంపై శ్రీవారి దర్శనం.. ఈ సేవల ప్రత్యేకతలు ఇవే..

  పూర్వం ఒకానొక సందర్భం లో ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం ఆహారంతో సహా మాయ అని వ్యాఖ్యానించాడు. ఆహార దేవత అయిన పార్వతికి కోపం వచ్చి, భూమిపై ఉన్న మొత్తం ఆహారాన్ని అదృశ్యం చేయడం ద్వారా ఆహారం ప్రాముఖ్యతను ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. ప్రపంచం ఆకలితో బాధపడటం ప్రారంభించింది. శివుడు చివరకు పార్వతి వద్దకు వచ్చి ఆహారం ప్రాముఖ్యతను గుర్తించి, ఆమె తలుపు వద్ద ఆహారం కోసం వేడుకున్నాడు.

  ఇదీ చదవండి : సీఎం క్లాస్ పీకిన ఆ 27 మంది ఎవరు? నలుగురు మంత్రలు, మాజీ మంత్రులు కూడా

  పార్వతి సంతోషించి, శివునికి తన చేతులతో ఆహారాన్ని సమర్పించి, తన భక్తుల కోసం వారణాసిలో అన్నపూర్ణ దేవి గా దర్శనమిస్తోంది. అన్నపూర్ణాదేవిని శివుడు మాత బిక్షందేహి అని తనకు అన్నప్రసాదాలు ప్రసాదించమని కోరాడని పురాణాలు చెపుతున్నాయి. ఈ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మ వారికీ  గంధపురంగు లేదా పసుపు రంగు చీరతో అలంకరించి - దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Navaratri, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు