హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: శ్రీ మహిషాసుర మర్ధని దేవిగా జగన్మాత.. ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా?

Dussehra 2022: శ్రీ మహిషాసుర మర్ధని దేవిగా జగన్మాత.. ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా?

మహిషాసుర మర్ధినిగా అమ్మవారు

మహిషాసుర మర్ధినిగా అమ్మవారు

Dussehra 2022: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా సాగుతున్నాయి. నేడు 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022:  దేశ వ్యాప్తంగా దేవీ శరన్నరవాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిల్లో వెలసిన మండపాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తున్నారు. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దసరా సందడి మరింత ఉత్సాహంగా సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అంత్యంత్య ప్రాముఖ్యత ఉన్న ఇంద్రకీలాద్రి (Indhrakeeladhri) పై శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ (Kanaka Durgamma) ఈ రోజు భక్తులకు శ్రీ మహిషాసుర మర్ధని (MahiShasura Marhini) దేవి రూపం లో దర్శనమీయనున్నారు .ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని సేవిస్తే..  సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయి.

  ఆశ్వీజ సుద్ద నవమి ఈ రోజున శ్రీ మహిషాసుర మర్ధని దేవి గా దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారు.. తనను కొలచి వచ్చే భక్తులను ఆపదలనుండి కాపాడుతారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో కాపాడేలా దీవెనలందిస్తుంది అమ్మవారు. ఈరోజు అమ్మను దర్శించుకుంటే  ఆపదలు, భయాలు.. ఇతర అడ్డంకులు తొలిగిపోతాయన్నది భక్తుల నమ్మకం..

  ఈ మంత్రం పఠిస్తే అంతా మంచే జరుగుతుంది.                                        అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదినీ నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ॥

  ఇదీ చదవండి : సీఎం జగన్ ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే.. ఇష్టంగా ఆయన ఏం తింటారో తెలుసా?

  అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురిడిని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది. ఈ తల్లి దుష్ట సంహారిణి. శిష్ట సంరక్షణి. మహిషాసుర, చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి. కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి. కారుణ్యమూర్తి. మహిషాసురమర్దనీ దేవి  అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడంతో  అరిష్వర్గాలు నశిస్తాయి..

  ఇదీ చదవండి : స్నపనంలో ఆకర్షణీయంగా కుంకుమపువ్వు.. పిస్తా-బాదం మాల‌లు.. కిరీటాలు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?

  సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు. అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయి. ఈ రోజు అమ్మవారికి ముదురు ఎరుపు రంగు చీర తో అలంకరించి చెక్కర పొంగలిని నివేదిస్తారు. మహిషాసుర మర్దినిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడతారు.. ఈ రోజు దర్శించుకుంటే.. కచ్చితంగా తమకు ఎదరవుతున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం.

  ఇదీ చదవండి: సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై శ్రీవారు.. ఈ సేవల విశిష్టత ఏంటంటే?

  మరోవైపు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సోమవరాం సైతం భక్తులు ఆందోళనలకు దిగారు. సామాన్య భక్తులకు దర్శించుకునే అవకశాం ఇవ్వడం లేదని.. కేవలం వీఐపీ భక్తులను మాత్రమే అధికారులు పట్టించుకుంటున్నారని.. తమకు కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యుల దర్శనానికి ప్రస్తుతం 9 గంటలకుపైగా సమయం పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Navaratri, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు