హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: దుర్గాదేవి అవతారంలో అమ్మవారు.. దర్శించుకుంటే పుణ్య ఫలం ఏంటో తెలుసా?

Dussehra 2022: దుర్గాదేవి అవతారంలో అమ్మవారు.. దర్శించుకుంటే పుణ్య ఫలం ఏంటో తెలుసా?

దుర్గాదేవి అవతారంలో అమ్మవారు

దుర్గాదేవి అవతారంలో అమ్మవారు

Dussehra 2022: ఇంద్రకీలాద్రిపై శరన్నవారత్రి ఉత్సవాలు వైభంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు.. అమ్మవారు దుర్గా దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో దర్శించుకుంటే పుణ్యఫలం ఏంటో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

   Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

  Dussehra 2022: దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ ప్రముఖ పుణ్యక్షేత్రం.. విజయవాడ (Vijayawada) లోని ఇంద్రకీలాద్రి (Indhrakeeladhri) పై దసరా ఉత్సవాలు (Dussehra) భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. ఇక ఎనిమిదవ రోజు దుర్గా దేవి (Durga Devi) గా దర్శనమీయనున్న జగన్మాత కనకదుర్గాదేవి.. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు దుర్గా దేవి రూపంలో దర్శనమీయనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని సేవిస్తే.. దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. ఎనిమిదవ  రోజు ఆశ్వీజ సుద్ద అష్టమి ఈ రోజు అమ్మ వారు దుర్గాదేవి (Durga Devi) గా భక్తులకు దర్శనమిస్తున్నారు..

  లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీఅమ్మవారు ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని  అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది. శరన్నవరాత్రుల అందు దుర్గాదేవిని అర్చించటంతో దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది.

  దివ్యరూపిణి శ్రీ దుర్గమ్మ వారి దర్శనము సకల శ్రేయోదాయకం. రాక్షస సంహారనికి అమ్మవారు ఎత్తిన అవతారం. ఎందరో రాక్షసులను సంహరించి దేవతలకు, మానవులకు రక్షణగా నిలిచిన స్వరూపం దుర్గా రూపం, అమ్మవారి అత్యంత శక్తి వంతమైన రూపాలలో, అవతరాలలో దుర్గాదేవి అవతారం ఒకటి. శరన్నవరాత్రులలో అత్యంత శక్తివంతమైన రోజు దుర్గాష్టమి. నవరాత్రులలో  రోజు ని దుర్గాష్టమి దీన్ని మహాష్టమి గా పిలుస్తారు  ఈ రోజు నవరాత్రుల లో కెల్లా అత్యంత శక్తి మంతమైన రోజు ఈరోజున అమ్మవారిని దర్శించి సేవించు కుంటే  సకల శుభాలు కలుగుతాయి.

  ఇదీ చదవండి : ఒక్కసారి అక్కడ అడుగుపెట్టారంటే అంతే..! ఆశ్చర్యం తప్ప మరో ఎక్స్‌ప్రెషన్‌ ఉండదు..!

  దుర్గాష్టమి రోజున  వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది.  కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.

  ఈరోజు అమ్మ వారి ని  ఎరుపు రంగు చీరతో అలంకరించి అమ్మవారికి కదంబం,శాకాన్నం తో నివేదిస్తారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: AP News, Dussehra 2022, Madhra pradesh, Navaratri, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు