హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు.. నేడు దర్శించుకుంటే అన్నీ విజయాలే

Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు.. నేడు దర్శించుకుంటే అన్నీ విజయాలే

శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా కనక దుర్గ అమ్మవారు

శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా కనక దుర్గ అమ్మవారు

Dussehra 2022: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పదో రోజు అంటే ఇవాళ అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విషయాల్లో విజయం మీదే..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

   Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నరవారత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక నేడు విజయ దశమి (Vijaya Dasami) కావడంతో.. ఆలయాలన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే తెల్లవారు జామునుంచే ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం.. విజయవాడ (Vijayawada) లోని  ఇంద్రకీలాద్రిపై .. పదవ రోజు.. అంటే శరన్నవరాత్రి వేడుకల్లో చివరి రోజు.. కనకదుర్గ దేవి (Kakan Durga Devi) భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి దేవి (Sri Raja Rajeswari Devi) గా దర్శనమిస్తున్నారు. ఈ రోజు విజదశమి విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి ని దర్శించుకొని అమ్మను శరణు వేడినవారికి తల్లి  సకల శుభాలు, విజయాల ను ప్రసాదిస్తుంది.

  అంబా శాంభవి చంద్రమౌళి రబలాలి.. పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ। సావిత్రీ నవయవ్వనా శుభకరీ.. సామ్రాజ్య లక్ష్మీప్రదా అనే మంత్రం జపిస్తే.. కష్టాలన్నీ తొలిగి.. విజయాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఆశ్వయుజ శుద్ధ దశమి ఈ రోజునే విజయదశమిగా దసరా గా జరుపుకుంటున్నాం.

  శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదింపచేసే రూపంతో శ్రీ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అదిష్టానదేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరి దేవిని దర్శించి, అర్చించడంవలన మనకు సర్వ శుభములు కలుగును.

  ఇదీ చదవండి : అశ్వవాహనంపై శ్రీవారి వైభవం.. రథాన్ని లాగి పరవశించిన భక్తులు

  దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లి గా దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకొందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి. విజయ దశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్ఠానదేవత శ్రీ కనకదుర్గాదేవికి కృష్ణానదిలో నిర్వహించే హంస వాహనసేవ కనులపండువుగా తిలకించడానికి లక్షలమంది భక్తులు ఎదురు చూస్తున్నారు.  ఈ జల విహారాన్ని చూడముచ్చటైన వేడుకగా అభివర్ణించవచ్చు.

  ఇదీ చదవండి : 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

  మరోవైపు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం 9వ రోజు కనకదుర్గమ్మ మహిషాసుర మర్దని దేవి అంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనవాయితీలో భాగంగా కనకదుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సారెను తెచ్చారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ ఈవో డి.భ్రమరాంబ, జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, మంగళవాయిద్యముల నడుమ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభతో స్వాగతం పలికారు. పట్టు వస్త్ర సమర్పణ, అమ్మవార్ల దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటము, ప్రసాదములు అందజేశారు.  

  టీటీడీ తరఫున ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సాలికట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

  అదే రీతిలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో కూడా ఏర్పాట్లు చేసారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన శీఘ్రదర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేశారని అన్నారు. మూలా నక్షత్రం రోజున సుమారు 2 లక్షల 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు