హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: ఆదాయం పెరగాలంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకోండి.. బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం

Dussehra 2022: ఆదాయం పెరగాలంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకోండి.. బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం

రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం

రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారం

Dussehra: ఇంద్రకీలాద్రి ఆలయంపై దసరా శోభ అంబరాన్ని అంటుతోంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఆదాయం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Dussehra:  ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.  తొలిరోజున కనకదుర్గ అమ్మవారు (Kanaka Durga Mata).. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా (Swarnakavachalankrutha Durga Devi) భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా బాలభోగ నివేదన చేసిన తరువాత భక్తులను (Devotees) దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శిం చుకునే అవకాశం కల్పించారు. తొలి రోజే ఊహించని సంఖ్యలో భక్తులు రావడంతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నిర్వహించిన నగరోత్సవం భక్తులకు కనువిందుచేసింది.

  దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మ వారు రెండవ రోజు శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి.  

  ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారము,అనగా రెండవ రోజు శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా  శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తారు.  బాలా దేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీబాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు.

  మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి.

  ఇదీ చదవండి : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ బర్డ్స్.. దేవుడే కాపాడాడంటున్న యువతి కుటుంబం

  పూర్వం భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం. వేరు ఋషులను మునులను సమస్త  ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేతుండటం తో అమ్మవారు  హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు.

  ఇదీ చదవండి: నేడు తిరుమలకు సీఎం జగన్ .. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఈ సారి సామాన్యులకు అదిరే ఆఫర్

  ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.అందుకే బాల ఐయినా అమ్మవారు ఎంతో శక్తి మంథా మైనది అమ్మవారిని భక్తి శ్రద్దల తో పూజిస్తే శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra, Navaratri, Vijayawada

  ఉత్తమ కథలు