హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dussehra 2022: మహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ.. నేడు దర్శించుకుంటే.. ధనలాభం.. విద్య, సౌభాగ్యం అన్నీ సొంతం

Dussehra 2022: మహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ.. నేడు దర్శించుకుంటే.. ధనలాభం.. విద్య, సౌభాగ్యం అన్నీ సొంతం

మహాలక్ష్మీ రూపంలో కనకదుర్గమ్మ

మహాలక్ష్మీ రూపంలో కనకదుర్గమ్మ

Dussehra 2022: శరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా సాగుతున్నాయి. అమ్మవారు రోజుకు ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. నేడు మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని ద్శించుకుంటే పుణ్య ఫలం ఏంటో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Dussehra 2022: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మవారి ఆలయాలు.. పుణ్యక్షేత్రాలు.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) లో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ (Kanaka Durgamma) వారి దర్శనం కోసం వేలాది మంది నిత్యం ఎదురుచూస్తుంటారు. అలాగే రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులకు కోర్కెలు తీరుస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరోవ రోజు.. శ్రీ మహాలక్ష్మీ (Maha Laxmi) దేవి గా దర్శనం ఇవ్వనున్నారు కనకదుర్గమ్మ తల్లి..

  సాధారణంగా దసరా పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. చాలా చోట్ల ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి.. అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారు. దసరా పండుగ అంటే తొమ్మిది రోజుల పండుగ ఈ తొమ్మిది రోజులను నవరాత్రులుగా అమ్మవారిని కొలుస్తారు. ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కొక రోజు ఒక్కో అవతారం లో దర్శనమిస్తుంది. భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ ఉంటారు.

  ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న కనకదుర్గ దేవి ఈ రోజు.. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శనివారము శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమీయనున్నశ్రీ మహాలక్ష్మీ దేవి జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టమనే చెప్పాలి..

  ఇదీ చదవండి : ఉన్నత విద్యకు డబ్బులు లేవని భయపడుతున్నారా..? ఈ రోజే ఆఖరి రోజు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

  మూడు శక్తుల్లో ఒక శకైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య , సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.

  ఇదీ చదవండి: సరస్వతీ దేవికి పవన్ ప్రత్యేక పూజలు.. అక్టోబర్ నుంచి కీలక నిర్ణయాలు ఏంటంటే..?

  ప్రపంచాన్ని శాసించే ధనాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీ దేవి తనను ఎవరైతే భక్స్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని అనుగ్రహించి ఐశ్వర్యప్రాప్తి, విజయము ను ప్రసాదిస్తుంది. దసరా శరన్నవరాత్రులలో భాగంగా కనకదుర్గమ్మ తల్లి ని శ్రీ మహా లక్ష్మి దేవి గా గులాబీ రంగు చీర తో అలంకరించి చక్కెర పొంగలి, క్షీరాన్నం నివేదిస్తారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే.. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్థాయని.. సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు...

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2022, Navaratri, Vijayawada Kanaka Durga

  ఉత్తమ కథలు