ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...

AP Assembly Election 2019 : ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బు లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బు కోసం ఖజానాను తడుముకోవాల్సిందే.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 8:01 AM IST
ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ... దెబ్బేసిన కేంద్రం... నిధుల కోసం వేల కోట్ల అప్పులు...
చంద్రబాబు, మోదీ (File Images)
  • Share this:
టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఏపీ ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. పథకాలకూ, పరిపాలనకూ డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం నిధుల కోసం ఉన్న అన్ని మార్గాల్నీ అన్వేషిస్తోంది. కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్లు ఇవ్వకపోవడంతో... ముందుగానే ఖర్చులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు పెండింగ్ బిల్లులు క్లియర్ చెయ్యడానికి కేంద్రాన్ని ఎన్నిసార్లు డబ్బు అడిగినా ఇవ్వట్లేదని తెలుస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పథకాలకు గ్రాంట్ల రూపంలో రూ.31,690 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ రూ.595 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచీ రూ.10 కోట్లు మాత్రమే వచ్చాయి. రూల్ ప్రకారం అధికారులు మొత్తం రూ.97,606 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అందులో 45 రోజులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని లెక్కలేసి, వెంటనే ఇవ్వమని కోరుతున్నారు. 45 రోజుల ప్రకారం చూస్తే కేంద్రం రూ.12,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రిజర్వ్ బ్యంక్ అనుమతితో... చంద్రబాబు ప్రభుత్వం రూ.1000 కోట్లు అప్పు తీసుకుంది. ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్ నుంచీ జూన్)లో... రూ.8,104 కోట్ల అప్పు తీసుకునేందుకు RBI అనుమతి ఇచ్చింది. దాంతో ఏప్రిల్‌లో ఒకేసారి రూ.5 వేల కోట్లు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత మరింత అప్పు చేశారు. తాజాగా మరో రూ.1,000 కోట్ల రుణం తెచ్చుకున్నారు. ఇంకా రూ.1000 కోట్లు మాత్రమే రుణం తీసుకునే ఛాన్స్ ఉంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రూ.6,000 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులు కేంద్రం నుంచీ రావాల్సి ఉంది. కేంద్రం ఆ నిధులు ఇవ్వట్లేదు. అటు పోలవరం బిల్లులకు రెగ్యులర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నుంచీ చెల్లింపులు జరుగుతున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో నిధుల కొరత ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.

 

ఇవి కూడా చదవండి :

వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...రామోజీరావుతో చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే...

అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...
First published: May 16, 2019, 8:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading