హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dubbaka By-election Result 2020: దుబ్బాక ఫలితంపై ఏపీలో టెన్షన్లు... ఎందుకు?

Dubbaka By-election Result 2020: దుబ్బాక ఫలితంపై ఏపీలో టెన్షన్లు... ఎందుకు?

దుబ్బాక ఫలితంపై ఏపీలో టెన్షన్లు... ఎందుకు?

దుబ్బాక ఫలితంపై ఏపీలో టెన్షన్లు... ఎందుకు?

Dubbaka By-Poll Result 2020: దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ హోరు ప్రచారం చేశాయి. మరి ఏపీలో కొందరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు?

  Dubbaka By-election Result 2020: దుబ్బాక నియోజకవర్గం ఉన్నది తెలంగాణలో. అందువల్ల సహజంగానే ఫలితంపై తెలంగాణ ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. టెన్షన్ కూడా వారికే ఉంటుంది. అలాంటిది ఏపీలో కొందరు తెగ టెన్షన్ పడుతున్నారు. గోళ్లు గిల్లుకుంటూ... ఉత్కంఠతో ఫలితం కోసం చూస్తున్నారు. వాళ్లెవరంటే... కాయ్ రాజా కాయ్‌లు. అవును... దుబ్బాక అసెంబ్లీ స్థానంపై పంటర్లు రకరకాలుగా బెట్టింగ్స్ వేయించారు. గెలిచేదెవరు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? టీఆర్ఎస్ పరిస్థితేంటి? కాంగ్రెస్ పరిస్థితేంటి? బీజేపీ ఏ స్థానంలో ఉంటుంది? ఇలా రకరకాలుగా పందేలు కాశారు ప్రజలు. ఉప ఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు భిన్నమైన రీతిలో రావడంతో బెట్టింగ్‌‌లు కూడా రకరకాలుగా వేసుకున్నారు.

  Bihar Election Result 2020 | Dubbaka Bypoll Result Live Updates: దుబ్బాక - బీహార్‌లో మొదలైన కౌంటింగ్

  కార్లలో వచ్చి ఆరా:

  వివిధ పార్టీల గెలుపుపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్స్ జరిగాయి. కౌంటింగ్ సమయంలోనూ బెట్టింగ్స్ కొనసాగేలా చేస్తున్నారు. శని, ఆదివారం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో కాస్ట్‌లీ కార్లు అటూ ఇటూ తిరిగాయి. గెలుపోటములపై ప్రజలతో ఆ కార్లలో ప్రయాణికులు ఆరా తీశారు. కొంతమంది తాము కట్టిన బెట్టింగ్‌ వివరాలను కూడా ప్రజలతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ గెలుపోటములపై కొంతమంది రెండు కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ కట్టినట్లు తెలిసింది. స్కోడా, రేంజ్‌రోవర్‌ వంటి కాస్ట్‌లీ కార్లలో వచ్చిన వ్యక్తులు తమది గుంటూరు జిల్లాగా చెప్పుకున్నారని తెలిసింది.

  ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020

  గెలుపెవరిది?

  కార్లలో వచ్చిన వారు తమ వివరాలు చెప్పడానికి నిరాకరించారు. షాకింగ్ విషయమేంటంటే... దుబ్బాకలో ఇలాంటి బెట్టింగ్ గోల ఎప్పుడూ లేదు. స్థానికులెవరూ అంతగా బెట్టింగ్స్ జోలికి వెళ్లరు. అలాంటిది ఈసారి ఎన్నిక ఎంతో ఆసక్తిగా సాగడం... పార్టీలు హోరాహోరీగా తలపడటంతో... బెట్టింగ్ జోరందుకుంది. డబ్బున్న వాళ్లు కోట్లలో కడితే... మధ్యతరగతి, పేద వారు... తమ తమ స్థాయిల్లో లక్షలు, వేలలో బెట్టింగ్ పెట్టినట్లు తెలిసింది. ఎవరికి వారు సొంత లెక్కలు వేసుకుంటున్నారు. ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను లెక్కలోకి తీసుకొని పందేలు కాసినవారూ ఉన్నారు.

  ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020

  దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. వీరిలో సుజాత, రఘునందన్‌రావు, శ్రీనివాసరెడ్డి గెలుపోటములపై ఎక్కువ పందేలు నడిచినట్లు తెలిసింది.

  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ జరుగుతోంది. దుబ్బాక అభ్యర్థుల ఫ్యూచర్ కాసేపట్లో తేలనుం. పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ప్రకారం ఒక సర్వే బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తుండగా, మరో సర్వే టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని, మరో సర్వే సంస్థ బీజేపీ జెండా ఎగరడం తథ్యమని చెప్పడంతో ప్రజలు ఎవరిది గెలుపన్నదానిపై ఆసక్తిగా చూస్తున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు