హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: చెట్ల పొదల్లో రూ. 53 లక్షల డబ్బు.. కడప ఏటీఎం వ్యాన్ చోరీ కేసులో ట్విస్ట్.. డ్రైవర్ ఏమైనట్లు?

Andhra Pradesh: చెట్ల పొదల్లో రూ. 53 లక్షల డబ్బు.. కడప ఏటీఎం వ్యాన్ చోరీ కేసులో ట్విస్ట్.. డ్రైవర్ ఏమైనట్లు?

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cash Van Robbery: సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డ్రైవర్ ఫరూఖ్ కోసం గాలించారు. ఈ క్రమంలో వినాయక నగర్లో క్యాష్ వ్యాన్ దొరికింది. కానీ అందులో డబ్బు లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏటీఎంల్లో నగదును నింపేటప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సిబ్బంది ఏటీఎంల్లో డబ్బులు నింపుతారు. కానీ ఏపీ (Andhra Pradesh)లో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు నింపే వాహనం (ATM Cash van Robbery) చోరీకి గురయింది. డ్రైవరే దానిని ఎత్తుకెళ్లాడు. పెద్ద మొత్తంలో డబ్బున్న వాహనంతో పరారయ్యాడు. కడప (Kadapa) జిల్లాల్లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో పోలీసులు పురోగతిని సాధించారు. నిన్న సాయంత్రం వాహనం దొరికింది. ఇవాళ కర్నాటక సరిహద్దులో కొంత డబ్బు కూడా లభ్యమైంది. కానీ డ్రైవర్ ఆచూకీ మాత్రం చిక్కలేదు.

  ఏటీఎంల్లో డబ్బును అమర్చే కంపెనీల్లో సీఎంఎస్ కూడా ఒకటి. శుక్రవారం కడప తాలుకా పరిధిలోని పలు ఏటీఎం కేంద్రాల్లో డబ్బును నింపాల్సి ఉంది. ఐతే తమ వ్యాన్ డ్రైవర్ లీవ్ పెట్టడంతో.. కాగితాల పెంటకు చెందిన ఫరూఖ్‌ని తాత్కాలిక డ్రైవర్‌గా నియమించుకుంది. నిన్న మధ్యాహ్నం రెండు ఏటీఎం కేంద్రాల్లో రూ.15 లక్షల చొప్పున డబ్బును పెట్టారు. అనంతరం ఐటీఎం సర్కిల్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ఓ ఏటీఎంలో రూ.15 లక్షలు అమర్చేందుకు సిబ్బంది లోపలికి వెళ్లారు. ఆ సమయంలో వాహనం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో.. డ్రైవర్ ఫరూఖ్ ఇదే అదునుగా భావించి. అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు. క్యాష్ వ్యాన్‌లో దాదాపు 60 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. వినాయకనగర్ జంక్షన్ వద్దకు చేరుకోగానే అతడు క్యాష్ వ్యాన్‌ను వదిలేసి.. డబ్బుల బాక్స్‌తో మరో వాహనంలో పారిపోయాడు.

  సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. డ్రైవర్ ఫరూఖ్ కోసం గాలించారు. ఈ క్రమంలో వినాయక నగర్లో క్యాష్ వ్యాన్ దొరికింది. కానీ అందులో డబ్బు లేదు. సీసీ ఫుటేజీ ఆధారంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో మరో కీలక ఆధారం లభించింది. ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లోని చెట్ల పొదల్లో దాదాపు రూ.50 లక్షల నగదు దొరికింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బుతో అతడు రాష్ట్రం దాటినట్లు పోలీసులు భావిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో అతడి కోసం గాలిస్తున్నారు. కర్నాటకలోనూ జల్లెడపడుతున్నారు. అక్కడి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని దాచి పెట్టాడు. చెట్ల పొదల్లో నుంచి రూ.53 లక్షల నగదను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. మిగతా సొమ్ముతో రాష్ట్రం దాటినట్లు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కర్ణాటకలోనూ గాలిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kadapa, Robbery

  ఉత్తమ కథలు