పీపీఈ కిట్లు లేవని ప్రభుత్వం మీద విమర్శలు చేసి సస్పెన్షన్‌కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేసిన సుధాకర్...తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని అభ్యర్థించారు. కోర్టు పర్యవేక్షణలో తనకు వైద్యం జరపాలని సుధాకర్ న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదని, ట్యాబ్లెట్ల వివరాలను పిటిషన్లో పేర్కొన్నారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ తెలిపారు. ‘డాక్టర్ సుధాకర్‌కు అందిస్తున్న వైద్యం పట్ల అనుమానాలున్నాయి. సుధాకర్‌పై పిచ్చోడనే ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సుధాకర్‌ను మానసిక ఆస్పత్రికి ఎందుకు తరలించారనేది సందేహంగా ఉంది. వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని ఉందని భావిస్తున్నాం.’ అని డాక్టర్ సుధాకర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ అన్నారు.
తనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ విశాఖలో రోడ్డు మీద అర్థనగ్నంగా నిరసన తెలపడంతో పోలీసులు ఆయన్ను చేతులు వెనక్కి కట్టి, లాఠీతో కొట్టారు. రోడ్డు మీద ఆ దృశ్యాలు పలు టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. ఈ కేసులో పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.