Home /News /andhra-pradesh /

DOUBLE DHAMAKA FOR ANDHRA PRADESH BOY HE GOT NASA OFFER AND BLESSING FROM PM MODI NGS TPT

Super Kid: ప్రధాని మోదీ మెచ్చిన తెలుగు తేజం.. సేల్స్ మెన్ కొడుక్కి నాసాలో ఆఫర్

ప్రధాని మోదీ మెచ్చిన బాలుడు

ప్రధాని మోదీ మెచ్చిన బాలుడు

Super kid: ఒక సాధారణ సేల్స్ కుమారుడు అతడు.. కానీ ఇప్పుడు ప్రధాని మోదీతో శెభాష్ అనిపించుకున్నాడు. కోడింగ్ లో తానే నెంబర్ వన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

    GT Hemanth Kumar, News18, Tirupati     Super Kid: కృషి ఉంటె మనుషులు ఋషులు అవుతారు.... మహా పురుషులు అవుతారని.. .మహా భారత కాలంలోని ఏకలవ్యుడు రుజువు చేసాడు. పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేసేస్తున్నారు నేటి యువత. తమ కోరిక బలమైనది అయితే అంతకన్నా బలంగా లక్ష సాధనలో ముందుకి దూసుకెళ్తున్నారు. అలాంటి ఓ తెలుగు కుర్రాడు వండర్ కిడ్ అనిపించుకున్నారు. అంతేకాదు అద్భుతమైన ఆఫర్ కూడా అందుకున్నాడు.

    ఏదో సాధించాలని లక్ష్యం ఉన్నా అతిడి ఇంటి పరిస్థితులు వెనక్కు నెట్టేలా చేశాయి. ముఖ్యంగా కటిక  పేదరికంలో  పుట్టడంతో..  తాను ఎంచుకున్న మార్గం రాజబాట కాదని తెసుకున్నాడు. ఆ కుర్రాడి ప్రతిభ చూసి.... ప్రధాని మోదీ శబాష్ అన్నారు. అంటే విద్యార్థికి ఉండే క్రేజ్ ఏంటో ఊహించవచ్చు. . జూమ్ యాప్ ద్వారా కుర్రాడితో మాట్లాడి స్వయంగా భారత ప్రధానే అభినందించేలా ఆ కుర్రాడు చేసి పనేంటో తెలుసా...?? అసలు ఆ కుర్రాడు

    సాధించినా ఘనత ఏంటి..??                                                                         కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జూటూరు చంద్రశేఖర్., పావని దంపతులకు ఇద్దరి కుమారులు. సేల్స్ మెన్ ఉద్యోగం చేస్తూ.... చంద్రశేఖర్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు సాయికుబేర్ మెరిట్ స్టూడెంట్. ఓ ప్రైవేట్ విద్య సంస్థలో 10వ తరగతి చదువుతున్నాడు. చిన్ననాటి నుంచే చదువంటే మక్కువ ఎక్కువ..... చదువుపైనే ఎక్కువశాతం ధ్యాస ఉంచే వాడు. గత నెలలో నాసా సౌజన్యంతో వైట్ హ్యాట్ జూనియర్ సంస్థ కోడింగ్ అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పరీక్షా పోటీలను ఆన్లైన్ లో నిర్వహించింది.

    ఈ పోటీల్లో  రెండు లెవెల్ ఉండగా.... మొదటి లెవెల్ లో 10 లక్షలమంది పోటీ పరీక్షల్లో పాల్గొనగా.....సాయికుబేర్ 116వ ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండవ లెవెల్ లో 50 వేలమంది పోటీ పడగ..... అందులోనూ సాయికుబేర్ 95వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను ప్రపంచ స్థాయిలో చూపించాడు. సాయి కుబేర్ ప్రతిభను గుర్తించిన సంస్థ నాసా కోడింగ్ విద్యకు ఎంపిక చేసారు. కుర్రాడి ప్రతిభను మెచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ....ఈ నెల 19వ తేదీ జూమ్ యాప్ ద్వారా విద్యార్థితో మాట్లాడారు. సాయికుబేర్.... అభినందలు తెలిపి... ప్రశంసించారు నరేంద్ర మోదీ. యని తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందించడం నా జీవితంలోనే మరువలేనిదని తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ప్రధాని మాటలతో నాపై మరింత బాధ్యత పెరిగిందని సాయి కుబేర్ అన్నాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Pm modi, Star kids

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు