Gulab Cyclone: ముంచుకొస్తున్న గులాబ్ తుఫాన్.. ఈ సమయంలో చేయాల్సినవి ఇవే..
గులాబ్ తుఫాను (Gulab Cyclone)
గులాబ్ తుఫాను (Gulab Cyclone) ముంచుకొస్తున్న సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (India Meteorological Department) ప్రజలకు పలు సూచనలు చేసింది. తుఫాను సమయంలో చేయకూడనివి, చేయాల్సిన పనులను పేర్కొంది.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెప్టెంబర్ 25, 2021 సాయంత్రం 5.30 గంటల సమయంలో 'గులాబ్ తుఫాను (Gulab Cyclone) గా మారిన సంగతి తెలిసిందే. ఇది గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 310 కి.మీ, కళింగపట్నానికి తూర్పుగా 380 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను గంటకు 7 కిలో మీటర్ల వేగంతో కదిలి బలపడిన తుపాను సెప్టెంబర్ 26, 2021 మధ్యాహ్నం 3 గంటల నుంచి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పైగా ఇది పశ్చిమంగా పయనిస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తఫాను సమయంలో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (India Meteorological Department) ప్రజలకు పలు సూచనలు చేసింది. తుఫాను సమయంలో చేయకూడనివి, చేయాల్సిన పనులను పేర్కొంది.
తుఫాను సమయంలో చేయాల్సినవి..
1. ఇంటి గోడలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏమైన పగుళ్లు ఉంటే సిమెంట్ టింకరింగ్ చేసుకోవాలి. తలుపులు, కిటికీలు మంచిగా ఉండేలా మరమ్మతు చేసి పెట్టుకోవాలని ఐఎండీ (IMD) సూచిస్తోంది.
2. ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోండి. గట్టిగా లేని చెట్లను తొలగించండి. చెత్తడబ్బాలు, ఇనుపముక్కలు ఇంటి పరిసరాల్లో ఉంటే తొలగించడం మంచిది.
3. ఇంట్లోకి వస్తువులు ఎగిరి రాకుండా ఉండేందుకు కిటికీలకు అడ్డంగా చెక్క బోర్డులను ఏర్పాటు చేసుకోవాలి.
4. ఇంట్లో కిరోసిన్, ఫ్లాష్‌లైట్, లాంతర్ సిద్ధంగా ఉంచుకోండి. వాటిని సులభంగా వాడుకొనేలా చార్జింగ్‌తో సిద్ధంగా ఉంచుకోండి.
5. పాత భవనాలు.. శిథిలావస్థలో ఉన్నవి కూల్చివేస్తే మంచిది.
6. ఇంట్లో కచ్చితంగా రేడియో సెట్లు ఉన్నవారు రేడియో పూర్తిగా సేవలందించేలా చూసుకోవాలి. నిరతరం వాతావరణ హెచ్చరికలను చూసుకోవాలి. తుఫాను తీవ్రతను తెలుసుకోని జాగ్రత్తగా ఉండాలి. రేడియో అయితే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ సమాచారం అందిస్తోంది.
7. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు ముందస్తు జాగ్రత్తగా ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లి ఉండడం మంచింది. ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి. నదీ పరివాహక ప్రాంతంలో ఉండే వారు మరింత అప్రమత్తంగా ఉండేలా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి.
8. ముందస్తు జాగ్రత్తగా వర్షాలు పడే ప్రాంతాల్లో ఉండే వారు ఇంట్లో అదనపు ఆహారాన్నిపొంది ఉండాలి. లోతపట్టు ప్రాంతాల్లో ఉండే వారు అదనపు నీటి నిల్వలను కలిగి ఉంటే మంచింది. పిల్లలు ఉన్న వారు వారికి అసవరమైన ఆహారాన్ని మందులను సిద్ధం చేసుకోవాలి.
9. వరదనీరు వచ్చే ప్రాంతంలో ఉంటే ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే వాటిని కాస్త సురక్షిత ప్రదేశాలకు, ఎత్తైన ప్రాంతాలకు పతరలించుకోవాలి.
13. ఇంటి చుట్టు పక్క ప్రాంతల్లో చెత్త ఉంటే అధికారులకు విన్నవించాలి. విపత్తును ఆసరా చేసుకోని ఏమైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే వెంటే పోలీసులకు నివేదించాలి.
14. విపత్తు ప్రాంతలో మీ భద్రతపై మీకు భయం ఉంటే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమచారం అందించండి.
తుఫాను సమయంలో చేయకూడనివి..
1. పుకార్లను నమ్మవద్ద. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సమాచారాన్ని విశ్వసనీయ మార్గల ద్వారా తెలిసిందే నమ్మాలని IMD ప్రజలకు సూచించింది.
2. రెస్క్యూ పర్సనల్స్ ద్వారా తెలియజేయబడే వరకు విపత్తు ఆశ్రయాలను వదిలి వెళ్లవద్దు.
3. మీరు ఉన్నప్రాంతం సురక్షితంగా ఉంటే ఎట్టి పరిస్థుల్లో వదిలివెళ్ల వద్దు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.