• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • DOOR DELIVERY OF RATION WILL START FROM JANUARY 1ST IN ANDHRA PRADESH THROUGH TRUCKS AK

AP Ration: ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి అంతా సిద్ధం.. ఆ రోజు నుంచే మొదలు..

AP Ration: ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి అంతా సిద్ధం.. ఆ రోజు నుంచే మొదలు..

ప్రతీకాత్మక చిత్రం

Ration Door Delivery in Andhra Pradesh: లబ్దిదారుల ఇంటి దగ్గరకే రేషన్ సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9260 వాహానాలను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

  • Share this:
    కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు ఉన్న వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు రేషన్ పొందేందుకు చౌక ధరల దుకాణానికి వెళ్లే అవసరం లేకుండా... నేరుగా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కొద్ది నెలలుగా ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తున్న వైసీపీ సర్కార్.. జనవరి ఒకటి నుంచి ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. లబ్దిదారుల ఇంటి దగ్గరకే రేషన్ సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9260 వాహానాలను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

    టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోనే సరుకులు తూకం వేసే కాంటాను అమర్చి.. ఇంటి దగ్గరే లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళితే.. అక్కడి లబ్దిదారులకు తెలిసే విధంగా ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాలను సబ్సిడీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్టు సమాచారం.

    ఇదిలా ఉంటే ఏపీలో ఈ నెల నుంచి రేషన్ సరుకుల ధరలు పెరిగాయి. కరోనా కారణంగా నవంబర్ వరకు ప్రభుత్వం ఉచితంగా సరకులు పంపిణీ చేసింది. అయితే ఈ నెల నుంచి వాటికి పొందేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రేషన్‌లో అందించే పలు సరుకుల ధరలు పెరిగాయి. వినియోగదారులు కిలో కందిపప్పు రూ. 67, చక్కెర అరకిలో రూ. 17, బియ్యానికి కిలో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. బియ్యం కిలో రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, చక్కెర రేట్లు పెరిగాయి. అయితే నాలుగు నెలల క్రితమే వీటి ధరలు పెంచినప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఉచిత పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే ఈ నెల నుంచి ఈ పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. అంతకుముందు కందిపప్పు కిలో రూ. 40లు ఉండగా.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది.

    ఇక రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ డీలర్లను తొలగిస్తారనే వార్తలు వినిపించాయి. సరుకులను గ్రామ, వార్డు వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించడంతో రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు అవుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. రేషన్ డీలర్లను తొలగించబోమని తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు