• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • DONKEY MEAT GETTING HUGE DEMAND IN ANDHRA PRADESH PEOPLE EATING THIS TO GAIN VIRILITY AND STRENGTH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ఏపీలో ఆ మాంసానికి ఫుల్ డిమాండ్... మగతనం కోసమేనట..

ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసానికి డిమాండ్

Donkey Meat: నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగుతున్నా అధికారులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఓ ఎన్జీవో దీనికి వ్యతిరేకంగా పోరాడుతోంది.

  • Share this:
    ఇది తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని ఎవరైనా చెప్తే చాలు.. జనం వాటి వెనుక పరుగులు పెడతారు. ముఖ్యంగా శారీరక సామర్ధ్యం, శృంగార సామర్ధ్యం పెరిగుతాయని చెప్పే వస్తువులను ఎగబడి మరీ కొనుగోలు చేసి తింటుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ వచ్చిపడుతోంది. రోజురోజుకీ గాడిద మాంసాన్ని తినేవారి సంఖ్య పెరుగుతోంది. పలు జిల్లాల్లో గాడిదలను అక్రమంగా వధించి  మాంసాన్ని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గాడిద మాంసం వ్యాపారం జోరుగా సాగుతోంది. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించకపోయినా అక్రమంగా వధించి మాసంగా విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగుతున్నా అధికారులు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఓ ఎన్జీవో దీనికి వ్యతిరేకంగా పోరాడుతోంది.

    గాడిద మాంసానికి ఇంత డిమాండ్ రావడానికి కారణం.. ఇది తింటే బలం వస్తుందని.. శృంగార సామర్ధ్యం పెగుగుతుందన్న నమ్మకమే. ఇందులో నిజమెంతుందో తెలియదుగానీ.. కొంతమంది గాడిద మాంసంపై ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. చట్టప్రకారం రిస్క్ అని తెలిసినా సరే గాడిద మాంసాన్ని తినేస్తున్నారు. గాడిద మాంసం తిన్న తర్వాత కనీసం రెండు కిలోమీటర్లు పరుగెత్తాలన్న మాటలు కూడా అక్కడక్కడా వినిపిస్తాయి. గాడిద పాలల్లో పోషక విలువలు, ఔషధ గుణాలుంటాయనే నమ్మకం కూడా జనాల్లో ఉంది. ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులకు ఇది సరైన మందు అని భావిస్తున్నారు. ఐతే దీనిపై డాక్టర్లు మాత్రం స్పష్టతనివ్వడం లేదు.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ పథకాల షెడ్యూల్ ఇదే... నెలనెలా సంక్షేమ పథకాలే..



    ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గాడిద విలువ రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పలుకోంది. గాడిదలపై అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాలు వాటిని ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 5వేల గాడిదలు మాత్రమే ఉన్నాయి. 2019 లెక్కల ప్రకారం దేశంలో 1.2లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయి. 2012 నుంచి దేశంలో 60శాతం గాడిదలు అంతరించిపోయాయి.

    ఆంధ్రప్రదేశ్ లో కొందరు ముఠాలుగా ఏర్పడి గాడిద మాంసం మాఫియాను నడిపిస్తున్నారు. ఓ ముఠా ఇతర రాష్ట్రాల నుంచి గాడిదలు తిసుకొస్తే... కొందరువాటిని వధించి మాంసంగా మారుస్తున్నారు. మరికొందరు ఆ మాంసాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గాడిదల సంఖ్య చాలా వేగంగా పడిపోతోంది. దీంతో వీటిని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు.

    చట్టం ఏం చెప్తోంది..?
    ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా జంతువులను వధించాలంటే అనుమతి పొందిన కబేళాకు వెళ్లాలి. గాడిద విషయంలో ఐపీసీ సెక్షన్ 428,429, పీఏసీ చట్టంలోని సెక్షన్ 11(1)(1) అనుమతి లేని జంతువులను వధించడం నేరం. దీనికి సంబంధి శిక్షలు కూడా ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం అలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని.. అక్రమంగా గాడిదలు వధించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: