Home /News /andhra-pradesh /

DOLLAR SESHADRI TTD OSD POPULAR PRIEST AT TIRUMALA TEMPLE DIES OF HEART ATTACK IN VISAKHAPATNAM MKS TPT

dollar seshadri : టీటీడీలో విషాదం -డాలర్ శేషాద్రి హఠాన్మరణం

డాలర్ శేషాద్రి (పాత ఫొటో)

డాలర్ శేషాద్రి (పాత ఫొటో)

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (Tirumala Tirupati Devasthanams -TTD) ప్రత్యేక అధికారి (ఓఎస్డీ), ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అందరికీ దాదాపు తెలిసిన వ్యక్తి డాలర్ శేషాద్రి ఇక లేరు. సుదీర్ఘకాలంపాటు టీటీడీలో సేవలందిస్తోన్న ఆయన సోమవారం తెల్లవారుజామున శ్రీవారి చెంతకు వెళ్లిపోయారు.

ఇంకా చదవండి ...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (Tirumala Tirupati Devasthanams -TTD) ప్రత్యేక అధికారి (ఓఎస్డీ), ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు అందరికీ దాదాపు తెలిసిన వ్యక్తి డాలర్ శేషాద్రి (dollar seshadri) ఇక లేరు. సుదీర్ఘకాలంపాటు టీటీడీలో సేవలందిస్తోన్న ఆయన సోమవారం తెల్లవారుజామున శ్రీవారి చెంతకు వెళ్లిపోయారు. టీటీడీ ఓఎస్డీ హోదాలోనే కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన శేషాద్రికి ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. గతంలోనూ ఓసారి గుండెపోటును ఎదుర్కొన్న ఆయన ఈసారి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో కుప్పకూలిన శేషాద్రిని ఆయన సహాయకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి మరణవార్తతో అటు టీటీడీలో, ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన పరిచయస్తుల్లో విషాదం నెలకొంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో చిన్న కొలువుతో మొదలైన శేషాద్రి జీవితం.. తిరుమల అర్చకులు అనగానే ఆయన ముఖమే గుర్తొచ్చేంత అత్యున్నత స్థాయికి ఎదగడం తెలిసిందే. 1978 నుంచి టీటీడీలో సేవలు అందిస్తోన్న ఆయన 2007లో రిటైర్మెంట్ పొందినప్పటికీ, ఆయన సేవలు అనివార్యమని భావించిన ప్రభుత్వాలు శేషాద్రిని ఓఎస్డీగా కొనసాగించాయి. దేవాలయ సాంప్రదాయాలపైన, దేవాలయ క్యూలైన్ల నిర్వహణా వ్యవహారాల పైన డాలర్ శేషాద్రికి గొప్ప పట్టుంది.

ఇదివరకు తిరుమల ఆలయంలో శ్రీవారి బంగారు రూపులు(డాలర్లు) అమ్మేవారు. ఆ విక్రయ విభాగం ఆయన ఆధ్వర్యంలో నడిచేది. కాబట్టే ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరొచ్చింది. డాలర్ శేషాద్రిపై ప్రశంసలు ఎన్ని ఉన్నాయో విమర్శలు కూడా అన్నే ఉన్నాయి. అయితే సదరు వివాదాల్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. శేషాద్రి మరణంపై ప్రముఖులు నివాళులు అర్పించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Ttd

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు