హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చిన్నారిపై కుక్క దాడి.. ఆ మాంసం తినే కరిచేస్తున్నాయన్న స్థానికులు..!

చిన్నారిపై కుక్క దాడి.. ఆ మాంసం తినే కరిచేస్తున్నాయన్న స్థానికులు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్క హటాత్తుగా  వచ్చి  ఆ పసికందు మీద పడి దాడి చేసింది. ఆ బాలూడి శరీరం మొత్తం గాయపరిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

ఏపీ తెలంగాణలో కుక్కల దాడులు ఆగడం లేదు. శునకాల దాడికి ఇప్పటికే పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వివారాల్లోకి వెళ్తే.. పాకాల పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీ నందు నివసిస్తున్న డి.బాలాజీ, కీర్తన దంపతులకు డి.కరీష్ రాజ్ అనే మూడు సంవత్సరముల కుమారుడు ఉన్నాడు.

అయితే  బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కరీష్ రాజ్ ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్క హటాత్తుగా  వచ్చి  ఆ పసికందు మీద పడి దాడి చేసింది. ఆ బాలూడి శరీరం మొత్తం గాయపరిచింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కుక్కల దాడికి వృధాగా పడేస్తున్న మాంసమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కొంతమంది వ్యాపారస్తులు వేస్ట్ మాంసాన్ని తెచ్చి ఊరి పరిసరాల్లో పారేయడం వల్ల ఆ మాంసం కుళ్ళి పురుగులు పడుతుందని .. అలా కుళ్లిన మాంసాన్ని కుక్కలు తిని  మతిస్థిమితం లేని పరిస్థితిలో పిల్లలపై వచ్చి పోయే వాళ్లపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీధి కుక్కల సమస్యలను పరిగణలోనికి  తీసుకొని స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ సమస్యను వీలైనంత త్వరగా  పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు.

First published:

Tags: Local News, Stray dogs, Stray dogs attack, Tirupati

ఉత్తమ కథలు