Home /News /andhra-pradesh /

DOCTORS WHO PERFORMED A RARE SURGICAL PROCEDURE FOR PREGNANT WOMEN AT HUZARABAD REGIONAL HOSPITAL BN

హుజురాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. వైద్యులు ఏంచేశారంటే..

హుజురాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. వైద్యులు ఏంచేశారంటే..

హుజురాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. వైద్యులు ఏంచేశారంటే..

ఓ గర్భిణీకి డెలివరీ సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆమె పరిస్థితి విషమంగా మారింది. అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని ఇందుకు సుమారూ రూ.2లక్షలకు పైగా ఖర్చవుతోందని సదరు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

    హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు ఓ గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆపదలో ఉన్న తల్లీబిడ్డలను రెండు గంటల పాటు విజయవంతంగా శస్ర్తచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొండెపి మండలం మొఘచింతల గ్రామానికి చెందిన ఏడుకొండలు, జయమ్మ దంపతులు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు అనూష గర్భవతి. ప్రతినెల హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తోంది. ఈ క్రమంలో డెలివరీ సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆమె పరిస్థితి విషమంగా మారింది.

    అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని ఇందుకు సుమారూ రూ.2లక్షలకు పైగా ఖర్చవుతోందని సదరు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో పేదరికం కారణంగా అంత డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేమని, తమ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా వెళ్లలేకపోయారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వ లేక.. స్వగ్రామానికి చేరుకోలేక నలిగిపోతున్నారు. మరోవైపు కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు.

    స్పందించిన మంత్రి ఈటల హుజురాబాద్ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిలను సదరు గర్భిణీని ఏలాగైనా ఆదుకోవాలని ఆదేశించారు. దీంతో సర్జన్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం రెండుగంటల పాటు శస్త్రచికిత్స చేసి తల్లిబిడ్డలను ప్రాణాపాయం నుంచి రక్షించారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులు మీనా, మహిపాల్ రెడ్డి, రమేష్, ప్రణీత, సిస్టర్స్ తిరుమల, సునీత, ఓటి అసిస్టెంట్ భద్రయ్య, బక్కయ్యలతో కూడిన వైద్య బృందాన్ని మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Eetala rajender, Minister, Pregnant, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు